ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! | IPL 2021: Airtel and Jio Users To Watch IPL Online For Free | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా!

Published Tue, Mar 9 2021 4:50 PM | Last Updated on Fri, Apr 2 2021 8:46 PM

IPL 2021: Airtel and Jio Users To Watch IPL Online For Free - Sakshi

ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సీజన్ మొదటి రోజున(ఏప్రిల్ 9) చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి)తో తలపడనుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం అయితే లేదు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఐపిఎల్ 2021ను వీక్షించాల్సి ఉంటుంది. ఈ టోర్నమెంట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మాత్రమే చూడటానికి అవకాశం ఉంది. మీరు కనుక ఎయిర్‌టెల్, జియో కస్టమర్ అయితే ఐపీఎల్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా చూడవచ్చు. 

సాధారణంగా ఇందులో మ్యాచ్‌లను లైవ్‌లో చూడాలంటే ప్రతీ నెలా రూ.399 చెల్లించాల్సిందే. అయితే ఎయిర్‌టెల్, జియో కంపెనీలు తమ వినియోగదారుల కోసం డిస్నీ + హాట్‌స్టార్‌కు ఉచిత చందాతో కూడిన ప్రత్యేక రీఛార్జిలను అందిస్తున్నాయి. దీనివల్ల మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. అలాగే మీరు ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మరి ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం..

జియో ప్లాన్స్:

రూ.401 ప్లాన్:
ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద 28 రోజులకు 90జీబీ డేటాను పొందుతారు. దీనిలో రోజుకు 3జీబీ డేటాతో పాటు అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. ఇవే కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు  కూడా పొందుతారు.

రూ.499 ప్లాన్:
ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద మీరు రోజుకు 1.5జీబీ డేటాను పొందుతారు. 56 రోజులు వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌కు ఎలాంటి వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం లభించదు.

రూ.598 ప్లాన్:
ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. 56 రోజులు వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌కు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు. 

రూ.777 ప్లాన్:
ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద రోజుకు 1.5జీబీ డేటాతో పాటు అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. మీరు 84 రోజుల పాటు మొత్తం 131జీబీ డేటాను పొందుతారు. ఇవే కాకుండా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు.

రూ.2,599 ప్లాన్:
ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద ఏడాది పాటు రోజుకు 2జీబీ డేటాతో పాటు 10జీబీ అదనపు డేటా లభిస్తుంది. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు. ఈ అన్ని ప్లాన్స్‌కు డిస్నీ + హాట్‌స్టార్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.

జియోతో పాటు ఎయిర్‌టెల్ వినియోగదారులు కూడా రూ.401, రూ.448, రూ.499, రూ.599, రూ.2,698 రీఛార్జ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ కస్టమర్లు రీఛార్జ్ ప్లాన్‌లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపీ ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. అలాగే ఉచిత వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ కింద లభిస్తాయి.

చదవండి:

మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్

వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement