
న్యూఢిల్లీ: ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియంలో న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకాకు స్థానం దక్కింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ రిటైర్ కావడంతో ఏర్పడిన ఖాళీలో ఆయన నియమితులయ్యారు. నూతన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే ఐదుగురు సభ్యుల కొలీజియంలో ప్రస్తుతం సీజేఐ ఖన్నాతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషీకేశ్ రాయ్ ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసే ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులు.
Comments
Please login to add a commentAdd a comment