సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఒరిస్సా, గుజరాత్, కేరళ హైకోర్టులకూ నూతన సీజేలను నియమించారు. ఈ వివరాలను న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బుధవారం ట్వీట్‌చేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా , ఒరిస్సా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుభాíÙశ్ తాళపత్రను అదే హైకోర్టుకు సీజేగా ఖరారు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఒరిస్సా హైకోర్టులో ప్రస్తుత సీజే ఆగస్టు ఏడున రిటైర్ అయ్యాక జస్టిస్ సుభాషిశ్ సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్‌ను గుజరాత్ హైకోర్టు సీజేగా నియమించారు. గుజరాత్ హైకోర్టులో జడ్జి అయిన జస్టిస్ ఆశిశ్ జె.దేశాయ్‌ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ నెల మొదట్లో ఈ హైకోర్టులతోపాటు ఆంధ్రప్రదేశ్, మణిపూర్ హైకోర్టులకూ సీజేలుగా జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేయగా ఏపీ, మణిపూర్ హైకోర్టుల్లో నియామకాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ పి.సామ్ కోషీని తెలంగాణ హైకోర్టుకు బదిలీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment