
కర్ణాటక: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి న్యుమోనియాతో బాధపడినట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన ఆమెను బెంగళూరులోని మనిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆక్సిజన్ సహాయంతో ఐసీయూలో ఉన్నట్లు పేర్కొన్నారు.
'పార్వతి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స జరుగుతోంది. త్వరలోనే వార్డుకు తరలిస్తాం.'అని ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. సీఎం సిద్దరామయ్య ఈ రోజు పార్వతిని కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: ముంబయి కొవిడ్ స్కాం: ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ సహచరుల ఇళ్లలో ఈడీ సోదాలు