కేజీఎఫ్ బాబు
బెంగళూరు: ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త కేజీఎఫ్ బాబు అలియాస్ ఉమ్రా బాబు అలియాస్ యూసుఫ్ షరీఫ్ నివాసంపై శనివారం ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరు వసంతనగర లో ఇల్లు, ఆఫీసులకు ఉదయమే చేరుకున్న ఐటీ అధికారులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు. ముఖ్యమైన పత్రాలు, కంప్యూటర్లను తనిఖీ చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబు నామినేషన్ పత్రాల్లో రూ.97.98 కోట్ల విలువైన చరాస్తులు, రూ.1643 కోట్ల విలువైన స్థిరాస్తులను ప్రకటించారు. మొత్తం ఆస్తులు రూ.1,741.57 కోట్లుగా తెలిపారు. ఇద్దరు భార్యల పేరుతో రూ.3.5 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు.
పది సంస్థలకు అధిపతి
కేజీఎఫ్ బాబు బాండ్లు,షేర్లు, మ్యూచువల్ పండ్స్‌లో రూ.17.62 కోట్లు పెట్టుబడులు పెట్టారు. రూ.58.12 కోట్లు ఇతరులకు రుణాలుగా ఇచ్చారు. రూ.2.09 కోట్ల విలువచేసే రోల్స్‌రాయిస్ కారు ఉంది. ఇంకా అనేక కార్లు ఉన్నట్లు తెలిపారు. బాబుకు అనేక రియాల్టీ కంపెనీలు ఉన్నాయి. టీనో ల్యాండ్ డెవలపర్స్, హిల్‌ల్యాండ్ బిల్డ్‌కాన్, ఉమ్రా బ్రదర్స్, ఉమ్రా డెవలపర్స్, అపనాన్ డెవలపర్స్, హిల్‌ల్యాండ్ ప్రాపర్టీస్, జుమేరా కన్‌స్ట్రక్షన్స్, జామ్‌జామ్ బిల్డర్స్, ఎంవీఆర్ సెక్యూరిటీస్ సహా సుమారు 10 సంస్థలకు ఆయన అధిపతిగా ఉన్నారు.
చదవండి: ట్రాఫిక్ జామ్‌పై నెటిజన్ వింత పోస్ట్.. వైరల్‌గా మారి నెట్టింట రచ్చ
Comments
Please login to add a commentAdd a comment