కర్ణాటకలో నాయకత్వ మార్పునకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం(31వ తేదీ) రోజున డీకే.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య.. మీడియాతో మాట్లాడారు.
సిద్ధరామయ్య ప్రెస్‌మీట్:
నేను సీఎం పదవికి రాజీనామా చేశా: సిద్ధరామయ్య
హైకమాండ్ సూచన మేరకు రాజీనామా చేశా
హైకమాండ్ రాజీనామా చేయాలని వెంటనే తొలుత రాజ్‌భవన్‌కు సమాచారం ఇచ్చా
రాజీనామా పత్రాన్ని లోక్‌భవన్‌లో కార్యదర్శికి ఇచ్చా
గవర్నర్ ప్రస్తుతం బెంగుళూరులో లేరు
నా రాజీనామా ఆమోదిస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నా
గవర్నర్ రాగానే నా రాజీనామా అంగీకరిస్తాన్న నమ్మకం ఉంది
కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి రాజ్యాంగపరంగా అన్నీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి
అధిష్టానం సూచనలకు కట్టుబడి ఉంటా
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పదవి నుంచి తప్పుకుంటున్నా
ఏడు కోట్ల కర్ణాటక ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం
మాకు మెజారిటీ ఉంది.. మద్దతు కూడా ఉంది
సీఎం పదవికి రాజీనామా సమర్పించిన సిద్ధరామయ్య
- గవర్నర్ సెక్రటరీకి రాజీనామా పత్రం అందజేసిన సిద్ధరామయ్య
- సిద్ధరామయ్య వెంట డీకే శివకుమార్, పలువురు మంత్రులు
లోక్‌భవన్‌కు చేరుకున్న సిద్ధరామయ్య
- రాజీనామాను సమర్పించనున్న సిద్ధరామయ్య
- గవర్నర్ లేకపోవడంతో ఆయన కార్యదర్శికి ఇచ్చే అవకాశం
- సీఎం సిద్ధరామయ్య వెంట డీకే శివకుమార్
- అనంతరం ఢిల్లీ వెళ్లనున్న సిద్ధరామయ్య
- రేపు బెంగుళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
- శివకుమార్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్‌మీట్..
- మధ్యాహ్నం మూడు గంటలకి సిద్ధరామయ్య మీడియా సమావేశం
- రాజీనామా లేఖను సమర్పించనున్న సీఎం సిద్ధరామయ్య
- సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీకి సిద్ధ రామయ్య
- రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సమావేశం
- రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
- డీకే శివకుమార్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
కాసేపట్లో డీకే, సిద్దు మీడియా సమావేశం..
- నేడు ఉదయం 11:15 గంటలకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉమ్మడి ప్రెస్ మీట్
- మీడియా సమావేశంలో రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్న సిద్ధరామయ్య
- అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నట్లు మంత్రివర్గ సహచరులకు తెలిపిన సిద్ధరామయ్య
- సిద్ధరామయ్య ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చిన అధిష్టానం
- అహిందా ఓటు బ్యాంక్ ను కాపాడుకునేందుకు ఆ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి
- ఓబీసీ నుంచి సిద్ధరామయ్య తనయుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం
- దళిత సామాజిక వర్గం నుంచి పరమేశ్వర్‌కు డిప్యూటీ సీఎం
- మైనారిటీల నుంచి ఒకరికి, లింగాయత్ సామాజిక వర్గం నుంచి ఎంబీ పాటిల్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం
సీఎంగా డీకే.. లైన్‌క్లియర్
- సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా.
- ఈనెల 31న కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం చేసే అవకాశం.
#WATCH | Bengaluru: Supporters of Karnataka Deputy CM and KPCC president D.K. Shivakumar distribute sweets and raise slogans in his support outside his residence, amid the speculations around CM post. pic.twitter.com/7OF4WnYJ5v
— ANI (@ANI) May 28, 2026
కర్ణాటక సీఎం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఆసక్తికర దృశ్యాలు..
- సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం ప్రకటన తర్వాత ఆసక్తికర పరిణామం
- సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
- బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో వెల్లడించిన సిద్ధరామయ్య
- గవర్నర్‌కు తన రాజీనామా లేఖ ఇవ్వనున్న సిద్దరామయ్య
#WATCH | Karnataka CM Siddaramaiah and Deputy CM DK Shivakumar share a hug at the CM residence in Bengaluru at the breakfast meeting. Deputy CM DK Shivakumar also touched the feet of CM Siddaramaiah.
(Video Source: Office of Deputy Chief Minister) pic.twitter.com/8bCChizsFL— ANI (@ANI) May 28, 2026
సిద్దూ ఆశ్వీరాదం..
- సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశ్వీరాదం తీసుకున్న డీకే.
- డీకేను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న సిద్దరామయ్య.
- డీకే శివకుమార్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సిద్ధ రామయ్య
రాజీనామా సమర్పించేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సిద్ధరామయ్య
Karnataka CM and Deputy CM, Siddaramaiah and DK Shivakumar, respectively, share a hug at the CM residence in Bengaluru at the breakfast meeting. Deputy CM DK Shivakumar also touched the feet of CM Siddaramaiah.
(Pics: CMO Karnataka) pic.twitter.com/qIATmAwj8a— ANI (@ANI) May 28, 2026
కాసేపట్లో మంత్రివర్గ సహచరులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్..
- బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్
- మధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా లేఖ పంపనున్న సిద్ధరామయ్య.
- బెంగళూరులో అందుబాటులో లేని గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్.
- ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా గత రాత్రి ఇండోర్‌కు వెళ్లిన గెహ్లాట్.
- గవర్నర్ అందుబాటులో లేకున్నా లోక్‌భవన్‌కు రాజీనామా లేఖ పంపనున్న సిద్దరామయ్య.
#WATCH | Karnataka Deputy CM and KPCC president D.K. Shivakumar arrives at the residence of Chief Minister Siddaramaiah for the breakfast meeting called by him. pic.twitter.com/yAT1SmRuQv
— ANI (@ANI) May 28, 2026
సిద్దు ఇంటికి చేరుకున్న డీకే..
- బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో భాగంగా డీకే శివకుమార్.. సిద్ధరామయ్య ఇంటికి చేరుకున్నారు.
- మరోవైపు.. డీకే సీఎం అవుతున్నారనే వార్తలు.. జోష్‌లో ఆయన మద్దతుదారులు
- స్వీట్ పంచుతూ డీకే అనుచరులు సందడి.
కాసేపట్లో బ్రేక్‌ఫాస్ మీటింగ్..
నేడు కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
ఎల్లుండి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
కాసేపట్లో మంత్రివర్గ సహచరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
హాజరుకానున్న డీకే శివకుమార్
రాజ్యసభ సీటు నిరాకరించిన సిద్ధరామయ్య
మరో రెండేళ్లు ఎమ్మెల్యేగానే కొనసాగుతానని అధిష్టానానికి వెల్లడి
జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేసిన సిద్ధరామయ్య
మధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా సమర్పించనున్న సిద్ధరామయ్య
అధికారికంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని వెల్లడించిన ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ సూర్జేవాలా.
రాజ్యసభకు సిద్ధూ నో
- సీఎం పదవి నుంచి వైదొలుగనున్న నేపథ్యంలో సిద్ధరామయ్యకు కాంగ్రెస్ రాజ్యసభ సీటు ఆఫర్
- ఎంపీగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనన్న సిద్ధరామయ్య
- జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా.. మరో రెండేళ్లపాటు ఎమ్మెల్యేగానే కొనసాగాలని నిర్ణయం.



