సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానం చేసింది. వెంటనే ఆ మూడు చట్టాలను ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరింది. మరోపక్క వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఆందోళన 36వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొంటున్నారు. వారంతా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని చిల్లా, ఘజియాపూర్ వద్ద రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పర్యవసానంగా నోయిడా, గజియాబాద్ మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. (చదవండి: రైతు సంఘాలతో చర్చల్లో పురోగతి)
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు రైతు నేతలతో ఆరోసారి సమావేశమై రాజీ చర్చలు జరిపింది. రైతుల నాలుగు ప్రధాన డిమాండ్లలో రెండు డిమాండ్లకు సంబంధించి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. కనీస మద్దతు ధర కొనసాగుతుందని లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు కేంద్రం ఒప్పకోవడం కూడా ఓ ప్రధానాంశం.
Comments
Please login to add a commentAdd a comment