పలాస జీఆర్‌పీ స్టేషన్‌లో రోధిస్తున్న ధనలక్ష్మి
సాక్షి, కాశీబుగ్గ: ప్రేమించి, సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేశాడంటూ ఓ యువతి రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించగా.. కీమెన్ చూసి ఆమెను కాపాడాడు. ఈ సంఘటన పలాస-కాశీబుగ్గ జంట పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కాశీబుగ్గ ఎల్‌సీ గేట్‌కు కొద్ది దూరంలో యువతి కూర్మాపు ధనలక్ష్మి రైలు ట్రాక్‌పై అనుమానాస్పంగా తిరుగుతుండటాన్ని చూసిన ట్రాక్ కీమెన్ వి.దుర్గాప్రసాద్ అమెను ప్రశ్నించి అరాతీశాడు.
ఒక వ్యక్తి చేతిలో మోసపోయానని.. అందుకే చనిపోవాలనుకున్నాని చెప్పడంతో ఆమెను ఓదార్చి సమీపంలోని గేట్ వద్దకు తీసుకువెళ్లాడు. పలాస జీఆర్‌పీ అధికారులకు సమాచారం అందించాడు. వరుసకు మేనమామైన డమరసింగ్ సింహాచలంతో సహజీవనం చేస్తున్నానని, ప్రస్తుతం ఇంటినుంచి వెళ్లిపోమని అనడంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు పోలీసులు తెలిపింది. పలాస జీఆర్‌పీ మహిళా కానిస్టేబుల్ అనిత, హెడ్‌కానిస్టేబుల్ కర్రి కోదండరావులు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment