సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో ఈ సారి ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలు ఆన్‌లైన్‌లో జరిపేందుకు మహా ప్రభుత్వం యోచిసస్తోంది. వార్షిక పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉంది. దీంత ఈ సారి బోర్డు పరీక్షలను నిర్వహించడం కష్టమైనప్పటికీ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించే విషయంపై విద్యా శాఖ నిపుణులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ మీడియాకు తెలిపారు. కాగా, విద్యార్థులందరికి చదువుకునే హక్కు ఉందని, ఏ పాఠశాలైనా ఫీజులు కట్టలేదని విద్యార్థులను క్లాసులు వినకుండా దూరం పెట్టవద్దని ఆమె సూచించారు. ఇలా ఎవరైనా చేసినట్లయితే ఆయా పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
25 శాతం సిలబస్ తగ్గింపు..
కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థులకు తరగతుల పరంగా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు అనేక పద్దతులను అవలంభించారు. ముఖ్యంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, టీవీ, గూగుల్, వాట్సాప్ ఇలా అనేక రకాలుగా 2020–2021 విద్యాసంవత్సరం విద్యార్థులుకు బోధన జరుగుతోంది. ఇలా వివిద పద్దతులు, మాధ్యమాల ద్వారా 82 శాతం విద్యార్థులకు విద్యాబోధన జరుగుతోంది. మరోవైపు ఇటీవలే నవంబర్ 23వ తేదీ నుంచి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు పాఠశాలలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే కరోనా కారణంగా అనేక ప్రాంతాల్లో పాఠశాలలు మరికొన్ని రోజులపాటు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకోగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రత్యక్షంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సారి కరోనా నేపథ్యంలో 25 శాతం సిలబస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి తగ్గించింది. అయితే ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహిస్తారు. కానీ, ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలలు పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. కానీ, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లలో విద్యాబోధన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యా శాఖ యోచిస్తోంది. చదవండి: (ఆయన పాలన నల్లేరు మీద నడకలా సాగలేదు)
ఎలా నిర్వహిస్తారు?
ఆన్‌లైన్ తరగతుల విషయంపై ఇప్పటికే విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులలో అయోమయం ఉంది. ఇదిలా ఉన్నప్పటికీ ఈ సారి ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలు ఆన్‌లైన్ లో నిర్వహించాల న్న ప్రస్తావన రూపొం దించారు. అయితే ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీలో అనేక సబ్జెక్టులుంటాయి. అదేవిధంగా అనేక భాషలున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం కష్టసాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నింటిపై అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనా అనే విషయంపై కూడా ఆలోచిస్తున్నట్టు వర్షా గైక్వాడ్ తెలిపారు. ఈ విష యంపై చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. చదవండి: (రేపు శివసేనలోకి ఊర్మిళ)
Comments
Please login to add a commentAdd a comment