
సాక్షి, హైదరాబాద్: గజరాజు అంటే మక్కువ లేనిదెవరికి.భార్యామణిని సైతం లెక్కచేయకుండా సాక్షాత్తూ విష్ణుమూర్తినే తనవైపు రప్పించుకున్న కరి .. సరిలేరు నాకెవ్వరు అని నిరూపించుకుంది కదా. అందుకే దానింత గజరాజుల రాజసం. ఆ దర్వాన్ని చూసి తీరాల్సిందే. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో నెటిజన్లు సందడి చేస్తున్నారు.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తల్లి పిల్లల ఏనుగుల వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వీడియో ఎప్పుడు తీశారో స్పష్టత లేనప్పటికీ, మొదటి రోజు స్కూలుకి డ్రాప్ చేస్తున్న తల్లి అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ట్వీట్ చేశారు. బుజ్జి ఏనుగును తల్లి ఏనుగు బుజ్జిగిస్తున్న ఈ వీడియో నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 14వేల వ్యూస్, దాదాపు 2,200 లైక్‌లను సాధించింది. "హహహ. నా కొడుకు చిన్నప్పటి రోజులను గుర్తు చేస్తుంది!" ఒక యూజర్ రాశారు. "రిపీట్ మోడ్‌లో చూడటానికి ఎంత ఆనందంగా ఉంది !!" మరొకరు సంతోషాన్నిప్రకటించారు.
అలాగే ఏనుగులు రోడ్డు దాటడం లేదు. రోడ్డే అడవిని దాటుతోంది .జాగ్రత్తగా చూడండి అంటూ ఒక అద్భుతమైన ఫోటోను పర్వీన్ కాశ్వాన్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
Look carefully. #Elephants are not crossing the road. Road is crossing the #forest. #WorldElephantDay pic.twitter.com/rfQspVybS5
— Parveen Kaswan (@ParveenKaswan) August 12, 2021
Mother on way to drop the kid on the 1st day of the school pic.twitter.com/5dVTD7kxjR
— Susanta Nanda IFS (@susantananda3) August 9, 2021




Comments
Please login to add a commentAdd a comment