ప్రేమించినోడితోనే పెళ్లి అన్నందుకు తండ్రి దారుణం.. | Man Assassinated Daughter To Stop Her From Marrying Boyfriend | Sakshi
Sakshi News home page

UP: ప్రేమించినోడితోనే పెళ్లి అన్నందుకు తండ్రి దారుణం..

Published Sun, May 23 2021 2:54 PM | Last Updated on Sun, May 23 2021 5:01 PM

Man Assassinated Daughter To Stop Her From Marrying Boyfriend - Sakshi

లక్నో: ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుందని తన కుమార్తెను హత్యచేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై రూరల్‌ అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. షాహి పోలీస్‌ స్టేఫన్‌ పరిధిలోని సీహోర్‌ గ్రామంలో చెరుకు తోట వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభించిందని తెలిపారు. దీంతో బరేలీ పోలీసులు శుక్రవారం ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారని పేర్కొన్నారు. అయితే ఆ మహిళ రాంపూర్‌ జిల్లాలోని మిలక్‌ ప్రాంత నివాసిగా గుర్తించినట్లు వెల్లడించారు.

కాగా రెండు రోజుల క్రితం ఆమె తప్పిపోయిందని, దీనిపై ఆమె తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదన్నారు. దీంతో తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనే హతమార్చినట్టు ఒప్పకున్నాడని అగర్వాల్‌ తెలిపారు. తన కుమార్తె ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానన్నందుకు కోపంతో చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని అన్నారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు.
(చదవండి: 20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement