
ముంబై: మహారాష్ట్రలోని మాజీ శాసన మండలి ఎమ్మెల్సీ వినాయక్ మేటే కారును ఒక వాహనం ఢీ కొనడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో ఆయనను నేవీ ముంబై సమీపంలోని ప్రవైట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం స్థలంలో కారు చాలా దారుణంగా నుజ్జునుజ్జు అయిపోయింది.
దీంతో కారులో ఉన్నవారందరికి తీవ్ర గాయాలపాలయ్యారు. వినాయక మేటే బీజేపీ మిత్రపక్షమైన శివసంగ్రామ్ చీఫ్‌గా కూడా పనిచేశారు. ఈ ప్రమాదంలో ఆయన భద్రత కోసం మోహరించి ఉన్న ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు.
మహారాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయిన మేటేకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ కూడా మేటే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు రాజకీయ విషయాల కంటే సామాజిక సమస్యలపైనే ఎక్కువ దృష్టి సారించేవారిన కాంగ్రెస్ నాయకుడు ఆశోక్ చౌహన్ అన్నారు. మరాఠా రిజర్వేషన్ల కోసం విశేష కృషి చేసిన గొప్పవ్యక్తి అని చెప్పారు.
(చదవండి: ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకం పెట్టడం కాదు.... గుండెల్లో ఉండాలి!)
Comments
Please login to add a commentAdd a comment