న్యూఢిల్లీ: ఆహార పదార్థాలు ఇంటికి తెచ్చి అందించే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కరోనా వేళ సరికొత్త సదుపాయం తీసుకొచ్చింది. తన కస్టమర్ల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడిన వారికి మందులు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ సమీపంలోని నోయిడాలో గురువారం నుంచి అమలు చేసింది. నోయిడాలో స్థానిక అధికారుల సహాయంతో కరోనా బాధితులకు మందులను ఆ సంస్థ సిబ్బంది అందజేస్తున్నారు.
దేశంలో అత్యధికంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నగరం ఢిల్లీ. రోజుకు వేలాది కేసులు.. వందలాది మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. అయినా కరోనా తీవ్రత చాలా ఉంది. ఈ సమయంలో అందరినీ ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించే సౌకర్యాలు లేవు. దీంతో చాలామంది కరోనా బాధితులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే వారికి మందులు లభించడం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో స్పందించి కరోనా బాధితులకు మందులు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. స్థానిక అధికారుల సహాయంతో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చిందని సమాచారం.
ఈ సందర్భంగా మందుల డెలివరీ అందుకున్న వారి ఫొటోలను జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ ట్వీట్ చేశారు. చిరాగ్ బర్‌త్యాజ్ తాను జొమాటోలో మందులు ఆర్డర్ చేయగా తనకు చేరినవని ఫొటోలు ట్విటర్‌లో పంచుకున్నారు. ఆ ట్వీట్‌ను దీపేందర్ గోయల్ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం జొమాటో యాప్‌లో శారీరకంగా బలం కోసం ఉపయోగించే మందులు.. విటమిన్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే కరోనా నివారణకు వేసుకునే మందులు లేవు. అయితే మందుల డెలివరీ ప్రస్తుతానికి నోయిడాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి దేశవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులో తీసుకువస్తారో తెలియదు. త్వరలోనే దేశవ్యాప్తంగా మందుల డెలివరీ కూడా అమలు చేసే అవకాశం ఉంది.
చదవండి: బ్రిటీష్ యువతికి పెళ్లి పేరిట పాకిస్తానీయుల కుట్ర
చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు
చదవండి: ఒకే రోజు లాక్‌డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు
Ordered another one from zomato, for c and zinc supplementation. The capsule is filled with black seed oil 🤔 nice pic.twitter.com/Ikc9n7khu3
— Chirag Barjatya (@chiragbarjatyaa) May 4, 2021
Comments
Please login to add a commentAdd a comment