ముంబై : దేశంలో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనకు గురిచేస్తోంది. థర్డ్ వేవ్ లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యల్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా చిన్నారులు వైరస్ బారిన పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది. దీంతో వారికి చికిత్సను అందించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సాంగ్లిలో ప్రత్యేకంగా పిల్లలకోసం కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదుగురు పిల్లలు ఈ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్నారు.
ఈ పరిణామాల గురించి స్థానిక కార్పొరేటర్ అభిజిత్ భోశ్లే మాట్లాడుతూ.. "మే నెలలో 8వేల మంది చిన్నారులకు కరోనా సోకింది. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైరస్ సోకిన చిన్నారులకు ట్రీట్మెంట్ అందించేలా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. స్కూల్ వాతావరణం ఎలా ఉంటుందో.. కరోనా వార్డులను అదే తరహాలో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇక.. ‘‘జిల్లాకు చెందిన చిన్నపిల్లలో 10శాతం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. అందుకే థర్డ్ వేవ్ నుంచి చిన్నారుల్ని సంరక్షించేందుకు చిన్నపిల్లల వైద్య నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు’’ అహ్మద్ నగర్ కలెక్టర్ తెలిపారు.
చదవండి: వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్!
Comments
Please login to add a commentAdd a comment