మనం తరచూ ప్రపంచంలో అత్యంత ధనికులు అంటూ కొందరి పేర్లను వార్తల్లో వింటూ ఉంటాం. ఒకప్పుడు బిల్‌గేట్స్ నుంచి ఇప్పుడు ఎలన్ మస్క్ దాకా చాలా మంది గురించి తెలుసు. ఇటీవల మన దేశానికి చెందిన గౌతమ్ ఆదానీ ఏకంగా ప్రపంచంలో టాప్–2 ధనవంతుడి స్థాయికి కూడా వెళ్లారు. వీరందరి ఆస్తి కూడా వారికి వివిధ కంపెనీల్లో ఉన్న షేర్ల (వాటాల) విలువ ఆధారంగా లెక్కిస్తారు. ఆ కంపెనీల్లో ఎంతో మందికి షేర్లు ఉంటుంటాయి కాబట్టి.. కంపెనీల విలువలు కూడా చాలా భారీగా ఉంటాయి. మరి ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల విలువలు చూద్దామా..
- ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ యాపిల్. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 2.324 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారు రూ. 1,92,53,654 కోట్లు (కోటీ 92 లక్షల కోట్లు).
- ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 210 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.17,39,788 కోట్లు (దాదాపు 17 లక్షల 39 వేల కోట్లు)
- మన దేశానికి చెందిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆస్తులు 129.5 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే.. రూ.10,72,869 కోట్లు (దాదాపు 10లక్షల 72 వేల కోట్లు). ప్రపంచ ధనవంతుల్లో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ 87 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ.7,20,769 కోట్లు (దాదాపు 7లక్షల 20వేల కోట్లు). ప్రపంచ ధనవంతుల్లో ఆయన ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
- అయితే అత్యంత ఎక్కువ విలువైన కంపెనీల అధిపతులు అయినా.. వారి ఆస్తులు తక్కువగా ఉండవచ్చు. ఆయా కంపెనీల్లో వారి వాటా తక్కువగా ఉండటమే కారణం. కొందరు ధనవంతులకు వేర్వేరు కంపెనీల్లో వాటాలు ఉంటాయి. ఆ కంపెనీలు అత్యంత విలువైన జాబితాలో లేకున్నా.. వాటన్నింటిలోని వాటాలు కలిసి
కొందరు అత్యంత ధనవంతుల జాబితాలో ఉంటుంటారు.
- సాక్షి, సెంట్రల్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment