గ్రామాల్లోనే ఎక్కువ మందికి కరోనా | Shocking: Most of the Corona Cases are Reported in Villages Only, India, National SERO Survey - Sakshi Telugu
Sakshi News home page

గ్రామాల్లోనే ఎక్కువ మందికి కరోనా: సర్వేలో షాకింగ్‌ నిజాలు

Published Fri, Sep 11 2020 10:17 AM | Last Updated on Fri, Sep 11 2020 5:33 PM

National Sero Survey Revealed Unbelievable Facts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఎంఆర్‌ నిర్వహించిన మొట్టమొదటి జాతీయ సెరో సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిని ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌లో ప్రచురించారు. భారతదేశంలోని గ్రామాలలో మొత్తం 69.4 శాతం మందికి కరోనా వైరస్‌ సంక్రమించినట్లు ఆ సర్వేలో తెలిసినట్లు పేర్కొంది. ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో 69.4 శాతం మందికి, పట్టణ మురికివాడలలో 15.9 శాతం మందికి, మిగిలిన ప్రాంతాలలో 14.6 శాతం మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఈ సర్వేలో వెల్లడైంది.  

18-45 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో పాజిటివిటీ అత్యధికంగా 43.3 శాతం ఉంది. ఆ తరువాత 46-60 సంవత్సరాల వారిలో 39.5 శాతం ఉండగా 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యల్పంగా కరోనా పాజిటివిటి ఉన్నట్లు తేలింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల్లో 700 గ్రామాలు, వార్డుల్లో మే 11 నుంచి జూన్ 4 వరకు ఈ సర్వే జరిగింది. కోవిడ్‌ కవచ్ ఎలీసా కిట్ ఉపయోగించి 28,000 మంది రక్తనమునాలు సేకరించి ఐజీజీ యాంటీబాడీస్ కోసం  పరీక్షించింది.  

చదవండి: దేశంలో రికార్డు స్థాయిలో 96,551 కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement