వెనకబడిన కుర్మీ కులానికి చెందిన నేత అయిన నితీశ్ తొలుత బిహార్ విద్యుత్ బోర్డులో ఇంజనీర్‌గా పని చేశారు. నాటి సోషలిస్టు నేత రాంమనోహర్ లోహియా సారథ్యంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1970ల్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ చేపట్టిన అన్ని రాజకీయ ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. 2000లో జేడీ(యూ) నేతగా తొలిసారి బిహార్ సీఎం పదవి చేపట్టినా ఆ ప్రభుత్వం కొంతకాలానికే కుప్పకూలింది. అనంతరం కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా తన పనితీరుతో ఆకట్టుకున్నారు.
2005లో రెండోసారి బిహార్ సీఎం అయ్యారు. అత్యంత వెనకబడ్డ రాష్ట్రాల్లో ఒకటిగా పేరుపడ్డ బిహార్‌కు సుపరిపాలన రుచి చూపించిన సీఎంగా మన్ననలు అందుకున్నారు. 2013లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 2015లో రాజకీయ ప్రత్యర్థులైన ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి మరోసారి సీఎం పీఠమెక్కారు. రెండేళ్లకే మహా ఘట్‌బంధన్‌తో తెగదెంపులు చేసుకుని మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. ఐదేళ్ల తర్వాత తాజాగా ఈ సీన్‌ను రివర్స్ చేసి తన గోడ దూకుడు నాటకాన్ని మరోసారి రక్తి కట్టించారు.
చదవండి: (పిల్లిమొగ్గల రాజకీయం)
Comments
Please login to add a commentAdd a comment