సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కలవరం పుట్టిస్తున్నకొత్త వైరస్ ఉనికి దేశంలోకూడా ఆందోళన రేపుతోంది. కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 9 మందికి కొత్త వేరియంట్ కోవిడ్-19 వైరస్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో బ్రిటన్ స్ట్రైయిన్ కరోనా కేసుల సంఖ్య 38కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. జనవరి 1కి 29గా ఉన్న కొత్త రకం కరోనా కేసుల సంఖ్య మూడు రోజుల్లో 38కి చేరింది. ఢి ల్లీలోని ఐజీఐబీలో 11, ఢిల్లీలోని ఎన్‌సీడీసీలో 8, బెంగళూరులోని ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో 10, పూణేలోని ఎన్‌ఐవీలో 5, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 3, కోల్‌కతాలోని ఎన్సీబీజీలో ఒకటి చొప్పున కొత్త రకం కరోనా వైరస్‌ను నిర్ధారించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా ఈ నెల 6 వరకు నిషేధించిన బ్రిటన్‌కు విమాన సేవలను, తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం మరింత ఆందోళన రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment