![Nurse Molested Killed On Way Home From Uttarakhand Hospital Body Found 9 Days Later In UP](/styles/webp/s3/article_images/2024/08/16/uttarakhand.jpg.webp?itok=ZDd85bXA)
డెహ్రాడూన్: కోల్‌కతాలోని ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. డాక్టర్లు, వైద్యుల నిరసన, సీబీఐ విచారణ, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో అట్టుడుకుతుంది. అయితే ఓ వైపు ఈ ఉదంతం దేశాన్ని కుదిపేస్తుంటే.. మరోవైపు ఉత్తరాఖండ్‌లో మరో నర్సుపై అత్యాచారం, హత్య జరిగిన ఘటన వెలుగచూడటం కలకలం రేపుతోంది. అంతేగాకయువతి అదృశ్యమైన దాదాపు తొమ్మిది రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని పక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో దొరికింది.
వివరాలు.. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు చెందిన మహిళా తన 11 ఏళ్ల కూతురితో నివసిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దులోని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. జూలై 31న కనిపించకుండా పోయింది. జూలై 30న ఆసుపత్రిలో పని ముగించికొని తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె సోదరి అదే రోజు రుద్రాపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో మహిళ ఆమె మృతదేహాన్ని ఆగష్టు 8న ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ పట్టణం దిబ్దిబా గ్రామ పొదల్లో కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మిది ఆమె ఇంటికి కేవలం 1.5కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే జూలై 30న మహిళ రిక్షాలో ఇంటికి తిరిగి వస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. కానీ ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమె రుద్రపూర్ సమీపంలోని బిలాస్‌పూర్‌లోని దిబ్దిబా ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది.
దానిని అనుసరించి మహిళ మొబైల్ నెంబర్‌ను కూడా ట్రేస్ చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించారు. అక్కడికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆమెను ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వెంబడించినట్లు కనిపించింది. అక్కడ మహిలే మృతదేహం లభ్యమైంది.
చివరకు ధర్మేంద్ర అనే అనుమానితుడిని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో అతడు ఆమెను కిడ్నాప్ చేసి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం గొంతు నులిమి చంపినట్లు తేలింది. అంతేగాక ఆమె పర్సు నుంచి రూ. 3 వేలు దొంగిలించాడన పోలీసులు తెలిపారు. తడిని భార్యతో సహా అరెస్టు చేసి రుద్రాపూర్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు వెళ్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment