330 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాం: అమిత్‌ షా | Parlament Budget Sessions Updates | Sakshi
Sakshi News home page

330 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాం: అమిత్‌ షా

Published Sat, Feb 10 2024 10:21 AM | Last Updated on Sat, Feb 10 2024 6:23 PM

Parlament Budget Sessions Updates - Sakshi

Updates:
►లోక్ సభ సమావేశాలు నిరవధిక వాయిదా

ఢిల్లీ: రామమందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజని తెలిపారు. ప్రజలు ఎలా జీవించాలో చేసి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడని పేర్కొన్నారు. రాముడు ఒక మతానికే చెందిన దేవుడు కాదు అని తెలిపారు.

రాముడు లేని భారతదేశాన్ని ఊహించలేమని.. మోదీ ఆధ్వర్యంలో 330 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించామని తెలిపారు. బీజేపీ, మోదీ ఏం హామీ ఇచ్చారో అది నెరవేర్చామని చెప్పారు. భారత సంస్కృతి రాముడితో ముడిపడి ఉందని అన్నారు. రామ మందిర నిర్మాణంలో అందరం ఐక్యమత్యంగా వ్యవహరించామని తెలిపారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు నేడు చివరిరోజు. ఉభయ సభల్లో రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది.  లోక్‌సభలో ఈ తీర్మానాన్ని  బీజేపీ ఎంపీలు రూల్ 193 కిందకు తీసుకురానున్నారు. సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రాజ్యసభలో, మోషన్ రూల్ 176 కింద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 

బీజేపీ ఎంపీలు కె. లక్ష్మణ్, సుధాన్షు త్రివేది, రాకేష్ సిన్హా రూల్ 193 ప్రకారం లోక్‌సభలో రామాలయం నిర్మాణంపై తీర్మాణం చేయనున్నారు. బీజేపీ ఎంపీలు సత్యపాల్ సింగ్ , శ్రీకాంత్ షిండే  రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టపై చర్చను లేవనెత్తనున్నారు.  ఉభయసభలలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు.

ఇదీ చదవండి: Ayodhya: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement