మనుషుల కంటే కూడా పెంపుడు జంతువులు ఎక్కువ ప్రేమ చూపిస్తాయి అంటారు. ఇది చాలా సార్లు నిజమైంది కూడా. కల్మషం లేని వాటి ప్రేమ ముందు ఏదైనా తక్కువే. ముఖ్యంగా కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషికి అవి మంచి స్నేహితులు. 24 గంటలు వాటికి అతుక్కునే ఉంటూ దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. తమను ప్రాణంగా చూసుకునే యజమానుల విషయంలోనూ అవి అలాగే ప్రవర్తిస్తాయి. ఇందుకు ఈ సంఘటనే ఉదాహరణ. తోటలో తన యజమానికి కుక్క సాయం చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. (కిమ్ అరాచకం: వారి పాలిట శాపం)
దీనికి సంబంధించిన వీడియోను వెల్‌కమ్ టు నేచర్ అనే ఓ సంస్థ గురువారం తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన తోట పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో అతని పెంపుడు కుక్క తనకు సాయం చేస్తోంది. మొక్కను నాటే ముందు తన కుక్కకు సంకేతం ఇవ్వడంతో అది మట్టిని తవ్వింది. దీంతో ఆ వ్యక్తి మొక్కను నేలలో నాటాడు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 60 వేల మందికి పైగా వీక్షించారు. 6 వేల లైకులు సంపాదించిన ఈ పోస్టుపై ‘వావ్. చాలా బాగుంది. ఈ వీడియోను చూస్తే నా పెంపుడు జంతువు గుర్తొచ్చింది. అందుకే అవంటే మాకు అంత ప్రాణం.’ అంటూ జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (హ్యాపీ గార్డెనింగ్)
good boy helps with gardening pic.twitter.com/gBcy52vivE
— Welcome To Nature (@welcomet0nature) August 20, 2020
Comments
Please login to add a commentAdd a comment