PM Modi And CMs likely Be Vaccinated Against Covid 19 Phase 2 - Sakshi
Sakshi News home page

సెకండ్‌ రౌండ్‌లో టీకా తీసుకోనున్న మోదీ?!

Published Thu, Jan 21 2021 11:43 AM | Last Updated on Thu, Jan 21 2021 5:19 PM

PM Modi And CMs Likely to be Vaccinated Against Covid 19 in Round 2 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాలు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీకా మొదట ప్రధాని నరేంద్ర మోదీనే తీసుకోవాలని.. అప్పుడే జనాలకు వ్యాక్సిన్‌ పట్ల ఉన్న భయం పోతుందని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఓ బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రస్తుతం వైరలవుతోంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెకండ్‌ రౌండ్‌‌లో ప్రధాని, ముఖ్యమంత్రులు వ్యాక్సిన్‌ తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రులతో సమావేశం సందర్భంగా మోదీ 50 ఏళ్లు పైబడిన నేతలంతా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఇక వ్యాక్సినేషన్‌ మొదటి రౌండ్‌లో వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అయిన పోలీసులు, రక్షణ దళాలు, మున్సిపల్‌ సిబ్బందికి టీకా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మూడవ రౌండ్‌లో 50 ఏళ్లు పైబడిన వారికి.. ఆ తరువాత రౌండ్‌లో 50 ఏళ్లలోపు వారితో పాటు సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. 
(చదవండి: ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్‌!)

నవంబర్ 24 న ప్రధాని మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశంలో టీకా ఇచ్చే విషయంలో తాత్కాలిక ప్రాధాన్యత గురించి చర్చించామని.. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశామని దీనితో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. "భారతదేశంలో, రక్తపోటు, మధుమేహం, కొరోనరీ గుండె జబ్బులు వంటి సహ-అనారోగ్యాలు పాశ్చాత్య జనాభాలో కంటే చాలా ముందుగానే వస్తాయి. కాబట్టి, 50 ప్లస్ జనాభాకు ప్రాధాన్యత ఇవ్వడం సరైన విధానం" అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె. శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement