ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న కల నెరవేరదు
కాంగ్రెస్‌కు ప్రధాని హితవు
సోనీపట్/న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టామని, దాన్ని మళ్లీ వెనక్కి తీసుకురావాలన్న ఆలోచన విరమించుకోవాలని కాంగ్రెస్ పారీ్టకి ప్రధాని మోదీ హితవు పలికారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను కురుక్షేత్రంగా సంగ్రామంగా అభివరి్ణంచారు. ఈ రణరంగంలో ఒకవైపు అభివృద్ధికి కట్టుబడి ఉన్న మోదీ సర్కారు, మరోవైపు ఓటు జిహాద్ మోహరించాయని అన్నారు. శనివారం హరియాణాలోని అంబాల, గొహనా, దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. దేశ వ్యతిరేక అజెండాను కాంగ్రెస్ దాచుకోవడం లేదని అన్నారు. బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే...
పాకిస్తాన్‌కు భయపడతామా?
‘‘ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న స్వప్నాన్ని కాంగ్రెస్ మర్చిపోవాలి. లేకపోతే మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత జమ్మూకశీ్మర్ అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. కాంగ్రెస్ అధికారానికి దూరమై పదేళ్లవుతోంది. ఆ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని శాసించిన ఆ పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వ పథకాలకు కేవలం ఒకే ఒక కుటుంబం పేరు పెట్టారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు.
కాంగ్రెస్ పాలనలో సరిహద్దుల్లో నిత్యం కాల్పులు, కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు జరుగుతుండేవి. మా ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. శత్రువు అప్పటి శత్రువే. కానీ, ప్రజల ఓటు పరిస్థితిని మొత్తం మార్చేసింది. సరిహద్దుల్లో ఉన్న మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఇదంతా కాంగ్రెస్‌కు, విపక్ష ఇండియా కూటమికి నచ్చడం లేదు. కాంగ్రెస్ మనుషులు పాకిస్తాన్ అధికార ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు. మనం పాకిస్తాన్‌కు భయపడతామా? ఇప్పుడున్నది నరేంద్ర మోదీ పరిపాలన. శత్రువులను వారి భూభాగంలో అడుగుపెట్టి మరీ దెబ్బకొడతాం.’’
Comments
Please login to add a commentAdd a comment