
బెంగళూరు: ప్రధాని మోదీ సోమవారం కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023ను ప్రారంభిస్తారు. పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలిపిన ‘ఈ20 ఫ్యూయెల్’ 84 రిటైల్ అవుట్‌లెట్లను ప్రారంభిస్తారు. గ్రీన్ మొబిలిటీ ర్యాలీని ప్రారంభిస్తారు.
వీటిని వివిధ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు తుమకూరులోని హెచ్‌ఏఎల్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ఉత్పత్తి కర్మాగారం. మరికొన్ని అభివృద్ధి పనులకూ ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment