
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రేపు (శనివారం) ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇవ్వనున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియను అధికారులు పరిశీలించనున్నారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షణతో పాటు, ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక కాల్‌సెంటర్ టోల్‌ఫ్రీ నెంబర్ - 1075 కాగా, క్షేత్రస్థాయి సిబ్బంది సందేహాలను అధికారులు నివృత్తి చేయనున్నారు. చదవండి: తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే
Comments
Please login to add a commentAdd a comment