![Punjab farmers head to Chandigarh in over 3000 vehicles - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/27/panjab-fa.jpg.webp?itok=a-0trcTW)
చండీగఢ్: పంజాబ్, హరియాణా రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పెండింగ్ డిమాండ్ల పరిష్కారానికి మూడు రోజులపాటు నిరసనలు తెలపాలన్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఆదివారం పంజాబ్, హరియాణా రైతులు ట్రాక్టర్ ట్రాలీల్లో వందలాదిగా చండీగఢ్‌కు చేరుకోవడం ప్రారంభమైంది. దీంతో, రైతులను అడ్డుకునేందుకు చండీగఢ్, పంజాబ్, హరియాణా పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు.
రైతులు ముందుగా మొహాలిలోని అంబ్ సాహిబ్ గురుద్వారాకు చేరుకుని, అక్కడి నుంచి సోమవారం చండీగఢ్ దిశగా తరలివెళ్తారని భావిస్తున్నారు. ఇలా ఉండగా, పంజాబ్ హరియాణా హైకోర్టు ఆదేశాల ప్రకారం..రైతులు రోడ్లపై బైఠాయించడం ధిక్కరణ కిందికి వస్తుందని పంచ్‌కుల పోలీస్ కమిషనర్ తెలిపారు. రైతుల ప్రవేశాన్ని నిరోధించేందుకు చండీగఢ్ యంత్రాంగం మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. చండీగఢ్–పంచ్‌కుల మార్గాన్ని మూసేసింది.
Comments
Please login to add a commentAdd a comment