ఢిల్లీ: దేశవ్యాప్తంగా 76 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో భారత ఖ్యాతికి పెంచుతూ పంజాబ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి జాతీయ పతాకాన్ని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతంపై ఎగురవేసి భారతీయుడి సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఈ నేపథ్యంలో అధికారులు అతడిని ప్రశంసిస్తున్నారు.
వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన పోలీసు అధికారి గుర్జోత్ సింగ్ కలేర్.. రష్యా, యూరప్‌లో ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. భారీ మంచు తుఫానులు, ఉరుములు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులతో పోరాడిన తర్వాత ఆగస్ట్ 11 ఉదయం 7 గంటలకు ఎల్బ్రస్ పర్వతంపైకి చేరుకున్న కలేర్ బృందం చేరుకుంది. అనంతరం.. నలుగురు కలేర్ సభ్యుల బృందం పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఎంతో కష్టతరమైన వాతావరణం..
ఈ నేపథ్యంలో గుర్జోత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఐదు రోజుల సమయం పట్టింది. పర్వతం శిఖరాగ్రంలో వాతావరణం చాలా క్లిష్టంగా ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీని వల్ల అధిరోహణ చాలా కష్టమైంది. ఒకానొక సమయంలో పర్వతాధిరోహణ అసాధ్యమని అని అనిపించింది. కానీ, పట్టుదల, సంకల్పంతో విజయం సాధించామన్నారు. మరోవైపు.. వృత్తిపరంగా శిక్షణ పొందిన పర్వతారోహకుడు కలేర్ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తమ పర్వతారోహకుడిగా ఎంపిక కావడం విశేషం.
సింగ్ రికార్డులు ఇవే..
మరోవైపు.. గుర్జోత్ సింగ్ కలేర్ అంతకుముందు.. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అంతేకాకుండా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన కరోనా యోధుల ధైర్యానికి హృదయపూర్వక నివాళిగా 15,000 అడుగుల నుండి స్కైడైవ్ కూడా చేశారు. కలేర్ ప్రస్తుతం AIG (ఎక్సైజ్ మరియు టాక్సేషన్) బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. జనవరి 2023లో విధి పట్ల అత్యుత్తమ అంకితభావానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్‌ను అందుకున్నాడు.
ఇక, రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం సముద్ర మట్టానికి 5,642 మీటర్లు (18,510 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఎల్బ్రస్ పర్వతం చుట్టూ మంచుతో కప్పబడి ఉంటుంది. బక్సాన్, మల్కా, కుబన్ అనే మూడు నదులు, 22 హిమానీనదాలకు ఈ పర్వతం నిలయం.
ఇది కూడా చదవండి: చెలామణిలో రూ.10 నాణేలు
Comments
Please login to add a commentAdd a comment