Independence Day 2023:
-
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఇంత కంటే గొప్పగా చెప్పలేరేమో!
ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా తన రోజూవారీ పనుల్లో తలమునకలవుతున్నా సరే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సందర్భాను సారం ఆసక్తికరమైన పోస్ట్‌లను అప్డేట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటారు. తాజాగా, భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఓ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇక ఆ వీడియోలో సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మంగా భావించే మూడు గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న భారత్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ జనగణమన అధినాయక జయహే అంటూ జాతీయ గీతాన్ని తన మ్యూజిక్ బృందంతో అలపించారు. ఇంగ్లాండ్‌లో అబ్బే రోడ్ స్టూడియోస్ అనే రికార్డింగ్ స్టూడియోలో నివాళులర్పించిన రిక్కీ కేజ్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..ఇలా ఇంతకన్నా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేరేమో అని ట్వీట్లో పేర్కొన్నారు. The World is indeed round. Things come full circle. 76 years after wresting our freedom from the British, an Indian CONDUCTS their finest orchestra in a tribute to our Independence. 🇮🇳🇮🇳🇮🇳 No better to wish you all a very Happy Independence Day pic.twitter.com/LQSBQNnuOY — anand mahindra (@anandmahindra) August 15, 2023 -
వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే..
స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంటే ఆగస్ట్ 15న చాలా మంది తమ వాహనాలపై త్రివర్ణ పతాకం పెట్టుకోవడాన్ని చూసేవుంటాం. అయితే ఇది చట్టవిరుద్ధం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని వివరాల ప్రకారం కొందరు ప్రముఖులకు మాత్రమే తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్న ఉంచే హక్కు ఉంది. వీరుకాకుండా మరెవరైనా తమ కారుపై త్రివర్ణ పతాకాన్ని తగిలించడం చట్టవిరుద్ధం అవుతుంది. అయితే ఇంతకీ తమ వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అర్హత కలిగినవారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా- 2002లోని సెక్షన్ IX ప్రకారం కొందరు ప్రముఖులు మాత్రమే తమ వాహనాలపై జాతీయ జెండాను ప్రదర్శించే హక్కును కలిగి ఉంటారు. ఈ జాబితాలోని వారు వరుసగా.. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ విదేశాల్లోని భారతీయ మిషన్లు/ప్రతినిధులు, వారు నియమితులైన దేశాల్లో.. ప్రధాన మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉప మంత్రులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ముఖ్యమంత్రులు, ఇతర క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉప మంత్రులు స్పీకర్, లోక్‌సభ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ రాష్ట్రాలలోని శాసన మండలి స్పీకర్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల స్పీకర్లు రాష్ట్రాలలోని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల డిప్యూటీ స్పీకర్లు భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుల న్యాయమూర్తులు ఇది కూడా చదవండి: ‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు -
నేడు జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! ఏంటీ తేడా అంటే..
నేడు జెండా ఎగరేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకిలా? ఈ రోజు ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా ఎగరేస్తే..జనవరి 26న మాత్రం రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. నేడు జెండా ఎగరేసాం అంటాం. మరీ గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం అని అంటాం ఎందుకని? వాటి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు... అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు... కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. ( గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ). నేడు ప్రధాని.. ఆ రోజు రాష్ట్రపతి చేయడానికి ప్రధాన కారణం దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). (చదవండి: అక్కడ మాత్రం అర్థరాత్రే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు) -
భారత ఖ్యాతిని పెంచిన పోలీసు అధికారి.. ఇండిపెండెన్స్ డే గిప్ట్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 76 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో భారత ఖ్యాతికి పెంచుతూ పంజాబ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి జాతీయ పతాకాన్ని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతంపై ఎగురవేసి భారతీయుడి సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఈ నేపథ్యంలో అధికారులు అతడిని ప్రశంసిస్తున్నారు. వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన పోలీసు అధికారి గుర్జోత్ సింగ్ కలేర్.. రష్యా, యూరప్‌లో ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. భారీ మంచు తుఫానులు, ఉరుములు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులతో పోరాడిన తర్వాత ఆగస్ట్ 11 ఉదయం 7 గంటలకు ఎల్బ్రస్ పర్వతంపైకి చేరుకున్న కలేర్ బృందం చేరుకుంది. అనంతరం.. నలుగురు కలేర్ సభ్యుల బృందం పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎంతో కష్టతరమైన వాతావరణం.. ఈ నేపథ్యంలో గుర్జోత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఐదు రోజుల సమయం పట్టింది. పర్వతం శిఖరాగ్రంలో వాతావరణం చాలా క్లిష్టంగా ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీని వల్ల అధిరోహణ చాలా కష్టమైంది. ఒకానొక సమయంలో పర్వతాధిరోహణ అసాధ్యమని అని అనిపించింది. కానీ, పట్టుదల, సంకల్పంతో విజయం సాధించామన్నారు. మరోవైపు.. వృత్తిపరంగా శిక్షణ పొందిన పర్వతారోహకుడు కలేర్ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తమ పర్వతారోహకుడిగా ఎంపిక కావడం విశేషం. సింగ్ రికార్డులు ఇవే.. మరోవైపు.. గుర్జోత్ సింగ్ కలేర్ అంతకుముందు.. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరమైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అంతేకాకుండా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన కరోనా యోధుల ధైర్యానికి హృదయపూర్వక నివాళిగా 15,000 అడుగుల నుండి స్కైడైవ్ కూడా చేశారు. కలేర్ ప్రస్తుతం AIG (ఎక్సైజ్ మరియు టాక్సేషన్) బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. జనవరి 2023లో విధి పట్ల అత్యుత్తమ అంకితభావానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్‌ను అందుకున్నాడు. ఇక, రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం సముద్ర మట్టానికి 5,642 మీటర్లు (18,510 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఎల్బ్రస్ పర్వతం చుట్టూ మంచుతో కప్పబడి ఉంటుంది. బక్సాన్, మల్కా, కుబన్ అనే మూడు నదులు, 22 హిమానీనదాలకు ఈ పర్వతం నిలయం. ఇది కూడా చదవండి: చెలామణిలో రూ.10 నాణేలు