న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి గత ఏడాది మహమ్మరి కంటే చాలా ఘోరమైనదని రుజువు చేసింది. ఎందుకంటే కేసులు, మరణాలు సంఖ్య విపరీతమైన వేగంతో పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో 3.5 లక్షలకు పైగా కరోనా కేసులు, 3,400 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. దేశంలో వరుసగా 13 రోజులు నుంచి 3 లక్షలకు పైగా కేసులను నమోదవుతున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. బయట పతిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అని.
2020లో కరోనా మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కూడా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య ఒక లక్షకు చేరలేదు. కానీ, ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. అత్యవసర హెల్త్‌కేర్ పరికరాలు, మెడికల్ ఆక్సిజన్, హాస్పిటల్ పడకలు, ఔషధాల కొరత వంటివి కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడానికి కరణమయ్యాయి. దీంతో దేశంలో ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజారింది.
దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 సంక్షోభం గురించి చాలా మంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. కరోనా మహమ్మరి విజృంభించకుండా నివారించడానికి అధికారులు సకాలంలో స్పందించలేదని నిపుణులు ఆరోపించారు. నిపుణుడు మాజీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, కోవిడ్ -19 మళ్లీ ఎందుకు పుంజుకుందో కొన్ని కారణాలను మీడియాతో పంచుకున్నాడు.
సరైన నాయకత్వం లేకపోవడం?
2020లో కరోనా మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకొని తిరిగి తగ్గుముఖం పట్టకపోవడానికి నాయకుల నిర్లక్ష్యమే కారణమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. "సరైన నాయకత్వం లేకపోవడం, దూరదృష్టి కలిగి ఉండకపోవడం" వల్లనే దేశంలో కరోనా మహమ్మరీ తిరిగి విజృంభించడానికి ప్రధాన కారణాలు అని తెలిపారు. "మీరు ఇంకా జాగ్రత్తగా ఉండి ఉంటే, మీరు కరోనా తగ్గలేదని ప్రజలను హెచ్చరించి ఉంటే, ఇంకా కరోనా తగ్గలేదని లేదని చేయాల్సిన పని పూర్తి కాలేదని గుర్తించి ఉంటే" అని బ్లూమ్బెర్గ్ ఇంటర్వ్యూలో రాజన్ పేర్కొన్నారు.
"ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలో వైరస్ తిరిగి వచ్చిందని ఉదాహరణకు, బ్రెజిల్ వంటి దేశాల్లో మళ్లీ విస్తరించిందని, వైరస్ తిరిగి రూపాంతరం చెందినట్టు గ్రహించి ఉండాలి" అని రాజన్ తెలిపారు. కరోనా వైరస్ పై జరిగిన పోరాటంలో దేశం విజయవంతమైందని చాలా మంది భారత ప్రభుత్వ అధికారులు ఇంతకుముందు ప్రకటించినట్లు తెలిపారు. అయితే, దేశంలో కేసులు మళ్లీ తిరిగి మార్చి నుంచి పెరగడం ప్రారంభించాయి. తర్వాత నెల ఏప్రిల్‌లో వేగంగా విజృంభించింది అని అన్నారు. ప్రస్తుతం రాజన్ చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ప్రస్తుతానికి, మీ ఆజాగ్రత్త వల్ల దేశం కోవిడ్ -19తో భాదపడుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం వల్ల కొన్ని పరిశ్రమల సంస్థలు, వైద్య నిపుణులు కొన్ని వారాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది విధించిన లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్దిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయినట్లు కాబట్టి లాక్‌డౌన్ విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోకపోతే కోవిడ్ -19 పరిస్థితి చెయ్యి దాటి పోతుందని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment