
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటే తప్ప ఏ ఒక్కరూ క్షేమంగా ఉన్నట్లు కాదని ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ సాగుతోందని, అయితే వైరస్ మన మధ్యే ఉంటుందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవడంతో పాటుగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment