ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తాము అందిస్తున్న నెలవారీ ఆర్థికసాయాన్ని రెట్టింపు చేయాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.2,000ల స్టైపండ్‌ను రూ.4,000కు పెంచాలని భావిస్తున్నట్లు సంబంధిత కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు.
ఈ పెంపు ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి ఆమోదించాల్సి ఉంది. పిల్లలకు అందిస్తున్న నెలవారీ భత్యాన్ని పెంచాలని కేంద్ర మహిళా, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని, త్వరలో ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment