
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానంలో మార్కుల ఒత్తిళ్లు విద్యార్థులపై అత్యధికంగా ఉన్నాయని, వాటిని తొలగిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. మార్కుల షీట్లు విద్యార్థులకు ఒత్తిడి షీట్లు అని, తల్లిదండ్రులకు అవే ప్రెస్టేజ్ షీట్లు అని వ్యాఖ్యానించారు. జాతీయ విద్యావి«ధానం 2020లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.
కొత్త దిశా నిర్దేశం
జాతీయ విద్యా విధానం దేశానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చేలా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వారిలో సృజనాత్మక ఆలోచనలు పెరిగేలా విద్యా బోధన జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగానే సిలబస్‌ను తగ్గించి మానసిక పరిణితి పెంచేలా కొత్త తరహాలో బోధనా పద్ధతులు ఉంటాయన్నారు. విమర్శనాత్మకమైన ఆలోచనలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆసక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందేలా కొత్త సిలబస్ ఉంటుందని చెప్పారు. ఎన్‌ఈపీపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విద్యా శాఖ వెబ్‌సైట్‌కి ఇప్పటికే 15 లక్షల సూచనలు వచ్చాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అయిదో తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన అత్యంత అవసరమని మోదీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment