న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కల్పతి వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఇద్దరు న్యాయమూర్తులతో సీజేఐ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రయాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు.
ఇటీవల జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 32కు పడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ పూర్తి స్థాయికి చేరింది. ప్రస్తుతం సుప్రీంలో సీజేఐతో సహా 34 మంది జడ్జీలు ఉన్నారు. అయితే వీరిలో మరో ముగ్గురు న్యాయమూర్తులు.. జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ వి రామసుబ్రమణియన్ వేసవి సెలవుల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మళ్లీ సంఖ్య తగ్గిపోనుంది.
చదవండి: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు
కాగా జస్టిస్ మిశ్రా, విశ్వనాథన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫారసు చేసింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నూతన మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ట్విట్టర్‌లో ప్రకటించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 48 గంటల్లోనే ఈ నియామకాలు జరిగాయి. ఇదిలా ఉండగా సీనియారిటీ ప్రకారం 2030లో జస్టిస్ వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.మే 16 కొలిజియం సాఫార్సు చేసింది.
చదవండి: ‘న్యాయశాఖ’ నుంచి రిజిజుకు ఉద్వాసన
Comments
Please login to add a commentAdd a comment