justice prashant kumar mishra
-
మరణశిక్షను ఆపిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పధ్నాలుగు సంవత్సరాల క్రితంనాటి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి మారే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దోషికి హైకోర్టు విధించిన మరణశిక్షను నిలుపుదలచేసింది. 2010లో ఏడేళ్ల పిల్లాడిని కిడ్నాప్‌చేసి చంపిన కేసులో సుఖ్జీందర్ సింగ్‌కు పంజాబ్, హరియాణా హైకోర్టు ఈఏడాది ఆగస్ట్‌లో మరణశిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ దోషి తరఫున లాయర్ హర్వీందర్ సింగ్ మాన్ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాల ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించిన శిక్ష తగ్గింపు నివేదికను బెంచ్ పరీశీలించింది. హత్య జరిగిన కాలంలో 23ఏళ్ల వయసులో నిందితుడు విపరీతమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆ రిపోర్ట్‌లో ఉంది. ‘ఎంతో మారిపోయిన ఇతను ఇకపై సమాజానికి ఏరకంగానూ హానికరం కాదు. 37 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇతనిలో సత్ప్రవర్తన వచ్చింది. ఏకంగా మరణశిక్ష విధించేముందు హైకోర్టు ఇతని మానసిక స్థితిపై తుది అవగాహనకు రాలేదు. రిహాబిటేషన్ సెంటర్‌కు పంపే అవకాశం ఇవ్వలేదు’ అని నివేదిక పేర్కొంది. ‘కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడిని చంపాడు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం పెల్లుబికిందన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కిడ్నాపర్‌కు పిల్లాడి తండ్రి డబ్బిచ్చినా చంపాడని హైకోర్టు మరణశిక్ష వేసింది’ అని నివేదిక వివరించింది. దీంతో కేసు విచారణను 16 వారాలు వాయిదావేసిన సుప్రీంకోర్టు ఈ విషయంలో ప్రొబేషన్ అధికారి నివేదిక ఇచ్చేలా చూడాలని పంజాబ్ సర్కార్‌ను ఆదేశించింది. అమృత్సర్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా గడిపిన సమయంలో ఇతని మానసిక పరిస్థితి, తోటి ఖైదీలతో ప్రవర్తన గురించి నివేదించాలని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం దోషి మానసిక స్థితిని టెస్ట్‌లు చేసి ధృవీకరించాలని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ను కోర్టు కోరింది. -
దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
-
సుప్రీం కోర్టు జడ్జీగా పదోన్నతి పొందిన ప్రశాంత్ కుమార్ మిశ్రా
-
ఏపీ నాకు ఎంతో ప్రత్యేకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తనపై చూపిన ప్రేమాభిమానాలు చూసి తాను చలించిపోయానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తెలిపారు. ఇంతటి ప్రేమాభిమానాలను గతంలో తానెక్కడా చూడలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా పనిచేసిన కాలం తన జీవితంలోనే మరిచిపోలేని సమయమని ఆయన తెలిపారు. ఇక్కడ సీజేగా పనిచేయడాన్ని తానెంతో ఆస్వాదించానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకెంతో ప్రత్యేకమైనదన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని చెప్పుకోవడానికి తానెంతో గర్విస్తానని కూడా మిశ్రా చెప్పారు. ఏపీని విడిచివెళ్లడం తనకెంతో బాధగా ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు హైకోర్టు న్యాయవాదులు శనివారం గుంటూరు పరిధిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో భారీ సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. జస్టిస్ మిశ్రా, ఆయన సతీమణి సుచేతను హైకోర్టు న్యాయవాదులు, వివిధ జిల్లాల న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, పూర్వ ఏసీజే జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె. జానకిరామిరెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డిలతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది.. సన్మానం అనంతరం జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సైతం తన సొంత రాష్ట్రమేనన్నారు. తాను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే నాటికి హైకోర్టులో కొన్ని క్లిష్టమైన సమస్యలున్నాయని, వాటిని తన సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగుల సహకారంతో పరిష్కరించానన్నారు. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదని, మంచి వ్యవస్థని తయారుచేస్తే మంచి వ్యక్తులు తయారవుతారని తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రధాన న్యాయమూర్తిగా తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించానన్నారు. ఇక తనకిప్పుడు న్యాయవాదులు చేసిన ఈ సన్మానాన్ని తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ హైకోర్టు భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని జస్టిస్ మిశ్రా చెప్పారు. భవిష్యత్తులో తనకు ఏపీ కోసం పనిచేసే అవకాశమివ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని జస్టిస్ మిశ్రా చెప్పారు. జస్టిస్ మిశ్రా గొప్ప మానవతావాది.. అంతకుముందు.. ఏసీజే జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ, పేరులో ఉన్నట్లు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారన్నారు. ఆయన సార్థక నామధేయుడని తెలిపారు. ప్రతీ విషయంపట్ల ఆయనకు ఎంతో లోతైన అవగాహన ఉందన్నారు. ఆయనో గొప్ప మానవతావాదని తెలిపారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. జస్టిస్ మిశ్రాకు ఎన్నో గొప్ప లక్షణాలున్నాయన్నారు. ప్రతీ విషయంలో మంచి చెడుల గురించి గొప్పగా ఆలోచిస్తారని, ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను శ్రద్ధగా వింటారని తెలిపారు. అదే సమయంలో కీలక నిర్ణయాలను వేగంగా కూడా తీసుకుంటారని చెప్పారు. జస్టిస్ మిశ్రాను టీం లీడర్‌గా ఆయన అభివర్ణించారు. ఏజీ శ్రీరామ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, సీనియర్ న్యాయవాదులు పి. వీరారెడ్డి, ఎస్ఎస్ ప్రసాద్, కె. చిదంబరం, హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు తదితరులు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా గురించి, ఆయన న్యాయవ్యవస్థకు అందించిన సేవల గురించి మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. -
సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కల్పతి వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఇద్దరు న్యాయమూర్తులతో సీజేఐ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రయాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సుప్రీంకోర్టు వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఇటీవల జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా పదవీ విరమణ చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 32కు పడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ పూర్తి స్థాయికి చేరింది. ప్రస్తుతం సుప్రీంలో సీజేఐతో సహా 34 మంది జడ్జీలు ఉన్నారు. అయితే వీరిలో మరో ముగ్గురు న్యాయమూర్తులు.. జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ వి రామసుబ్రమణియన్ వేసవి సెలవుల్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మళ్లీ సంఖ్య తగ్గిపోనుంది. చదవండి: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు కాగా జస్టిస్ మిశ్రా, విశ్వనాథన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫారసు చేసింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నూతన మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విట్టర్లో ప్రకటించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 48 గంటల్లోనే ఈ నియామకాలు జరిగాయి. ఇదిలా ఉండగా సీనియారిటీ ప్రకారం 2030లో జస్టిస్ వెంకటరమణ్ విశ్వనాథన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.మే 16 కొలిజియం సాఫార్సు చేసింది. చదవండి: ‘న్యాయశాఖ’ నుంచి రిజిజుకు ఉద్వాసన -
‘పిల్’లు దుర్వినియోగం
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్) పేరుతో కొందరు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు హెచ్చరించింది. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కొందరి వెనుక ఉంటూ డబ్బులిచ్చి హైకోర్టులో వీటిని దాఖలు చేయిస్తున్నారని పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో జరుగుతోందని, ఇలాంటి వ్యాజ్యాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉందని తేల్చి చెప్పింది. హైకోర్టులో కొందరి తరఫున పిల్లు దాఖలు చేయించేందుకు మధ్యవర్తులు కూడా ఉన్నారని తెలిపింది. తప్పుడు పిల్లు దాఖలు చేసే వారికి భారీగా ఖర్చులు విధించి తద్వారా గట్టి సందేశం పంపాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోడంతో అదే అంశంపై తిరిగి ధర్మాసనం ఎదుట పిల్ దాఖలు చేసిన వ్యక్తులకు ఖర్చులను కచ్చితంగా విధిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకు ఇది అన్ని రకాలుగా అర్హమైన కేసు అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ నేపథ్యం.. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి పరిధిలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటును సవాలు చేస్తూ జి.సుధాకర్‌రెడ్డి మరో ఇద్దరు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత విచారణ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇదే అంశంపై సింగిల్ జడ్జి ఎదుట ఓ వ్యక్తి పిటిషన్ వేశారని, అందులో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. ఆ విషయం తెలిసి కూడా పిటిషనర్లు పిల్ దాఖలు చేయడం కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. అత్యధిక శాతం దుర్వినియోగం చేసేవే.. తాజాగా ఈ పిల్ విచారణకు రావడంతో ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్లకు ఎంత మేర ఖర్చులు విధించాలో చెప్పాలని పేర్కొంది. ఈ రోజుల్లో నిజమైన పిల్లు చాలా స్వల్ప సంఖ్యలో దాఖలవుతున్నాయని, అత్యధిక శాతం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసేవేనని తెలిపింది. ఎవరో వేస్తారు.. ఎవరికో డబ్బు అందుతుంది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు నిరక్ష్యరాస్యులని నివేదించారు. కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి ఎంత మాత్రం లేదన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వలేదన్న విషయం వారికి తెలియదన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ పిల్లు దాఖలు చేసే వారికి భారీ మొత్తంలో ఖర్చులను విధించాల్సిందేనని, అయితే పిటిషనర్లు ఆ కోవలోకి రారని విన్నవించారు. అయితే నిరర్థక వ్యాజ్యాలపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి వ్యాజ్యాల కోసం తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని, ఇన్ని రోజులకు అలాంటి వ్యాజ్యం ఎదురైందని, రూ.25 లక్షలను ఖర్చుల కింద విధించాలన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను సైతం సిద్ధం చేశామని తెలిపింది. ఎవరో పిల్ వేస్తారని, ఎవరికో డబ్బులు చెల్లిస్తారని, ఇలాంటి వ్యాజ్యాలను విచారించడం తమ పని కాదని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యంలో ఖచ్చితంగా ఖర్చులు విధిస్తామని, అయితే అది ఎంతనేది తరువాత నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. -
న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి
నాయుడుపేట(తిరుపతి): న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సూచించారు. శనివారం హైకోర్టు నుంచి వర్చువల్ విధానంలో నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ గొప్పతనం, ఔన్నత్యం, గౌరవం ఇనుమడించేలా వ్యవహరించాలని సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లా కోర్టుల్లో మౌలిక వసతుల కొరత ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు చేపడుతామన్నారు. నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి యామిని మాట్లాడుతూ.. జిల్లాలో 1,166 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మిని న్యాయమూర్తులు, న్యాయవాదులు సన్మానించారు. నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి గీతావాణి తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఎంపికైన న్యాయమూర్తులు సోమవారం ప్రమాణం చేశారు. నూతన న్యాయమూర్తులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాత చేత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ ఏడుగురి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.రవీంద్రబాబు చదివి వినిపించారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీవీఎస్ రావు, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకి రామిరెడ్డి, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాతో కలిసి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాతో కలిసి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కలిసి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయితో కలిసి జస్టిస్ తర్లాడ రాజశేఖర్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుతో కలిసి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కలిసి జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కలిసి జస్టిస్ వడ్డిబోయన సుజాత కేసులను విచారించారు. హైకోర్టు చరిత్రలో ఏడు ధర్మాసనాలు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఆ తరువాత నూతన న్యాయమూర్తులను న్యాయవాదులు అభినందించారు. ఈ ఏడుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కి చేరింది. త్వరలో మరిన్ని నియామకాలు జరిగే అవకాశం ఉంది. జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి 1966 జూన్ 3న జన్మించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. అనేక కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2019లో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులై ఇటీవలి వరకు ఆ పోస్టులో కొనసాగారు. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు 1967 జూలై 1న జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎల్ పూర్తి చేశారు. హైకోర్టులో ఆంధ్ర ప్రాంత మునిసిపాలిటీలకు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ 1964 మే 28న జన్మించారు. ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా, నాగార్జున వర్సిటీ నుంచి మాస్టర్ లా పొందారు. సుప్రీం కోర్టులో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా, రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగాలాండ్ ప్రభుత్వం తరఫున కేసులు వాదించారు. జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు 1967 ఆగస్టు 3న జన్మించారు. విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎల్ చదివారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీవీఎస్ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్‌గా వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి 1970 ఫిబ్రవరి 5న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదివారు. తొలుత తాడేపల్లిగూడెంలో, 1997లో హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. జస్టిస్ రవి చీమలపాటి 1967 డిసెంబర్ 4న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులు వాదించారు. పంచాయతీరాజ్ శాఖ స్టాండింగ్ కౌన్సిల్‌గా, వివిధ ప్రభుత్వ సంస్థలకు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. జస్టిస్ వడ్డిబోయన సుజాత 1966 సెప్టెంబర్ 10న జన్మించారు. ఎంఏ (పొలిటికల్ సైన్స్), ఎంఏ (సైకాలజీ), ఎల్ఎల్ఎం చదివారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ప్యానెల్ అడ్వొకేట్‌గా, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ఇటీవలి వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. చదవండి: (ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు) -
మూడు రాజధానులపై మొదలైన విచారణ
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరిగి రోజూవారీ విచారణ ప్రారంభించింది. విచారణ మొదటిరోజే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. త్రిసభ్య ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులను ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ధర్మాసనాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని పరిధిలో న్యాయమూర్తులకు అప్పటి ప్రభుత్వం చదరపు గజం రూ.5 వేల చొప్పున ఒక్కొక్కరికి 600 గజాల స్థలం కేటాయించిందని ఆ పిటిషన్లో తెలిపారు. ప్రస్తుతం ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు కూడా ఆ స్థలాలు తీసుకున్నారని, అందువల్ల వారు ఈ మూడు రాజధానుల వ్యవహారంపై విచారణ జరపడం సబబుకాదని పేర్కొన్నారు. స్థలాల కొనుగోలు ద్వారా పెట్టుబడి సంబంధిత ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున వారు ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే అభ్యర్థించారు. న్యాయం జరగడమే కాక, జరిగినట్లు కూడా కనిపించాలన్నారు. ఇది సదుద్దేశంతో చేస్తున్న అభ్యర్థన అని వివరించారు. త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఇందుకు అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ నుంచి తప్పుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తాను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలా అయితే ఏదో ఒక సాకు చూపి ప్రతి ఒక్కరూ ప్రతి జడ్జిని కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరతారన్నారు. ఈ కేసులో తమ ధర్మాసనమే వాదనలు వింటుందని తేల్చి చెప్పారు. ఏదో ఒక నిర్ణయం చెప్పండి.. సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం.. విచారణ నుంచి తప్పుకోవాలన్న తమ పిటిషన్‌పై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సీజేను కోరారు. తమ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. దానిపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్నారు. మీ అభ్యర్థనను తిరస్కరిస్తామని సీజే చెప్పగా.. లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని దవే అభ్యర్థించారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని, తుది తీర్పు ఇచ్చే సమయంలో విచారణ నుంచి తప్పుకోవాలన్న పిటిషన్‌పై ఉత్తర్వులు ఇస్తామని సీజే చెప్పారు. అప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని దవే తెలిపారు. అభివృద్ధి స్తంభించిపోయింది సీజే స్పందిస్తూ.. ఏడాది కాలంగా ఈ కేసు ముందుకెళ్లడం లేదన్నారు. ఇక ఈ కేసు ముందుకెళ్లాల్సిందే నని, ఎన్నిరోజులైనా సరే ముందుకెళుతుందని, రోజువారీ విచారణ చేపడతామని చెప్పారు. ఈ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయిందని, వీటిగురించి అందరూ ఎదురుచూస్తున్నారని తెలిపారు. దవే స్పందిస్తూ.. విచారిస్తున్న కేసు విషయంలో న్యాయమూర్తులకు ప్రయోజనాలుంటే, వారే స్వచ్ఛందంగా విచారణ నుంచి తప్పుకోవాలన్నారు. అలా ప్రయోజనాలున్న న్యాయమూర్తులు ఆ కేసును విచారించడానికి అనర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని వివరించారు. జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు విషయంలో తమ అభ్యంతరాలను రికార్డు చేయాలని ఆయన అభ్యర్థించగా ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఇదే అంశంపై ఎప్పుడో వేసిన పిటిషన్ విచారణకు రాలేదు అంతకుముందు న్యాయవాది సింహంభట్ల శరత్ కుమార్ ఇదే అభ్యర్థనను లేవనెత్తారు. ఈ అంశంపై గతంలోనే వేసిన పిటిషన్ విచారణకు నోచుకోలేదని చెప్పారు. ఈ రోజు విచారణ జాబితాలో కూడా తన కేసు లేదని తెలిపారు. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులకు ఈ కేసులో ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నందునే వారిని విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతున్నామని, వారి విశ్వసనీయతపై తమకు సందేహం లేదని చెప్పారు.