ఢిల్లీ: రాష్ట్రంలో నీటి సంక్షోభం నెలకొన్న సమయంలో ట్యాంకర్ మాఫీయాను అరికట్టకపోవటంపై సుప్రీకోర్టు ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో నీటి వృధాపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని సీరియస్ అయింది. ట్యాంకర్ మాఫియా, నీటి వృధాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, జాగ్రత్తల రిపోర్టును తమకు అందజేయాలని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జిస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలే ఆదేశించారు.
ట్యాంకర్ మాఫియాను అరికట్టడం ప్రభుత్నానికి చేతకాకపోతే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తామని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
‘‘ కోర్టు ముందు నకిలీ స్టేట్‌మెంట్లు ఎందుకు ఇస్తున్నారు?. హిమాచల్ ప్రదేశ్ నుంచి వాటర్ వస్తోంది. ఢిల్లీకి వచ్చిన నీరు ఎక్కడికి వెళ్లుతోంది?. ట్యాంకర్ మాఫియా విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాజేయాలి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. చర్యలకు సంబంధిచి పూర్తి నివేదిక గురువారం అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
హిమాచల్ ప్రదేశ్.. హర్యానాకు ఇస్తున్న మిగులు నీటిని ఇలాంటి సంక్షోభ సమయంలో తమకు తరలించాలని ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రియించింది. దీంతో ఢిల్లీకి నీటిని అందించాలని సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్‌కు ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ నీటిని అందించిన హర్యానా తమ వాటాను తగ్గిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment