జెండా ఊపి మొబైల్ వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సుబ్రమణియన్, (ఇన్‌సెట్‌లో) వాహనంలో వైద్య సేవలు
సాక్షి, చెన్నై: ఇంటింటికీ విద్య, దంత వైద్య సేవా పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. చెన్నైలో తొలి విడతగా మొబైల్ దంత వైద్య సేవలకు సోమవారం ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ శ్రీకారం చుట్టారు. అందరికీ మెరుగైన వైద్యం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నైలో తొలిసారిగా సోమవారం ప్రజల వద్దకే దంత వైద్య సేవలకు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ శ్రీకారం చుట్టారు. ఇందు కోసం అన్ని రకాల వసతులతో ప్రత్యేకంగా మొబైల్ వాహనం సిద్ధం చేశారు.
ఇకపై ప్రతి శనివారం వ్యాక్సినేషన్ క్యాంప్
మీడియాతో సోమవారం ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ, ప్రజల వద్దకే దంత వైద్య సేవలకు శ్రీకారం చుట్టామని, దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఆదివారం మెగా వ్యాక్సిన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా అనేక మంది మాంసం ప్రియులు, మందుబాబులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదని పరిశీలనలో తేలిందన్నారు. ఆదివారం మద్యం తాగేందుకు, మాసం తినడానికి టీకా సమస్యగా మారుతుందేమోనన్న తప్పుడు ప్రచారమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అందుకే ఇకపై శనివారం మెగా వ్యాక్సిన్ శిబిరం ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. ఈసారి 50 వేల శిబిరాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. 53 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు చేతిలో ఉన్నాయని వెల్లడించారు.
చదవండి: (తొమ్మిదేళ్ల సర్వేశ్‌ని అభినందించిన సీఎం స్టాలిన్)
ఇంటి వద్దకే విద్య..
నవంబర్ 1వ తేదీన పాఠశాలల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నా, ఇంటి వద్దకే విద్య అన్న నినాదాన్ని తాజాగా అందుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 9,10,11,12 విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు విస్తృతం చేయనున్నా రు. అలాగే, 1తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇంటి వద్దకే వెళ్లి విద్యను అందించేందు చే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. సోమవారం సీఎం ఎంకే స్టాలిన్‌తో విద్యామంత్రి అన్భిల్ మహేశ్, కార్యదర్శి కాకర్లు ఉషాతో పాటుగా అధికారులు సమావేశం ఈ విషయంపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment