
ప్రేమ అనేది ఓ మధురమైన అనుభూతి, భావాలు తప్ప మాటల్లో వర్ణించలేని వర్ణన. అందుకే ప్రేమికులు తమ ప్రేమను కాపాడుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. కొందరు ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటే, మరికొందరు జీవితాల్ని నాశనం చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి కోసం ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 21ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు.
ఈ ఘటన తమిళనాడులోని పుదుకోట్టైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.... పుదుకోట్టై జిల్లాలోని పొన్నమరావతి సమీపం మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్ (40) 21ఏళ్ల క్రితం ఉపాధి కోసం కేరళకు వెళ్లి అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ ఘటనతో షాకైన నాగరాజన్ తన ప్రియురాలు ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న ఆ పరిసరాల్లోనే రోడ్డు మీద తిరుగుతూ ఆశగా ఎదురుచూసేవాడు. ఈ క్రమంలో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోవడంతో నాగరాజు మతిస్థిమితం తప్పింది. అలా ఏళ్లుగా నిరీక్షిస్తున్న అతడి విషయం ఇటీవలే జిల్లా అధికారులకు తెలిసింది. దీంతో వారు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సాయంతో అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment