Telangana Cm KCR Delhi Tour Highlights And Latest News Updates - Sakshi
Sakshi News home page

CM KCR Delhi Tour Updates: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ భేటీ..

Published Sun, May 22 2022 12:52 PM | Last Updated on Sun, May 22 2022 1:43 PM

Telangana Cm Kcr Delhi Tour Highlights - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతల సమావేశాలతో సీఎం కేసీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుత పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమిపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరు సీఎంలు చండీగఢ్‌ వెళ్లనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement