సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
ముందుంది శుభం
భారతీయ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరానికి ఒక పేరుండటం ఆసక్తి కరం. ఈ 60 ఏళ్ల చక్రంలో సంవత్సరాది ఏప్రిల్ మధ్యలో మొదలవుతుంది. 2019–20 సంవ త్సర పేరు, వికారి. అన్నట్టుగానే ఆ యేడాది అనారోగ్య సంవత్సరమే. 2020–21 శార్వరి అంటే చీకటి. ప్రపంచం చీకట్లో ఉండింది. 2021– 22 ప్లవ అంటే ఒడ్డు దాటించేది. ఇక 2022–23 సంవత్సరం పేరు, శుభ కృత్. సనాతన ధర్మం ఇంత ముందుచూపుతో నామకరణం చేసింది.
– పద్మజ, విశ్లేషకురాలు
నవ్వుదాం ఇక!
కొత్త సంవత్సరం అంత గొప్పగా ఏమీ ప్రారంభం కాలేదు. కానీ 2021 ఎంత దారుణమైన యేడాదంటే 2022కు అంత ఉత్సాహం లేని ప్రారంభాన్ని ఇచ్చింది. కానీ ఈ సంవత్సరంలో మనకు ఏడుపుల కంటే నవ్వులు ఎక్కువుంటాయని ఆశిద్దాం. రెండేళ్ల అనుభవాలను బట్టి ఈ కోరిక ఎంత విలువైనదో తెలియడం లేదా?
– మోనా నికోరా, డాక్యుమెంటరీ మేకర్
కింగ్‌ఖాన్ దేశం
ఈజిప్ట్‌లోని ఒక ట్రావెల్ ఏజెంటుకు డబ్బులు బదిలీ చేయాల్సి ఉండింది. కానీ ఎంతకీ బదిలీ కావడం లేదు. అతను అన్నాడు: ‘మీరు నటుడు షారుక్ ఖాన్ దేశానికి చెందినవాళ్లు కదా, నేను నమ్ముతాను. మీకు బుకింగ్ చేస్తాను, డబ్బులు తర్వాత చెల్లించండి. ఇంకో చోటివాళ్లకైతే నేను ఇలా చేయను. కానీ షారుక్ ఖాన్ కోసం ఏదైనా చేస్తాను’. అన్నట్టే బుకింగ్ చేశాడు.
– అశ్వినీ దేశ్‌పాండే, ఎకనామిక్స్ ప్రొఫెసర్
జాగ్రత్తగా మసలుకోండి
నాకు మళ్లీ కోవిడ్ నిర్ధారణ అయింది. నేను పూర్తి టీకాలు వేయించుకున్నాను. ప్రయాణానికి ముందు చేయించు కోవాల్సిన తప్పనిసరి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష ఇది. లక్షణాలేవీ లేవు. కొద్దిగా గొంతునొప్పి ఉంది. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. మీకు సాధారణ జలుబు ఉన్నా పరీక్ష చేయించుకోండి.
– సంజయ్ ఝా, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి
నోరెత్తాలి
ఒక టేబుల్ దగ్గర ఒక నాజీతో కలిసి మరో తొమ్మిది మంది నిరసన తెలపకుండా కూర్చున్నారంటే, ఆ టేబుల్ దగ్గర పదిమంది నాజీలు ఉన్నట్టు. ఇది ఒక జర్మన్ సామెత. మనకు పనికొస్తుందేమోనని గుర్తు చేయడం.
– షకీబ్ లోన్, అసిస్టెంట్ ప్రొఫెసర్
కోవిడ్ పెరుగుతోంది
దేశవ్యాప్తంగా కోవిడ్–19 కేసులు నమోదు అవుతున్నాయి. యాక్టివ్ కేసులు 2.1 శాతంతో పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి, టీకాలు వేసుకోండి, కోవిడ్ నిబంధనలు పాటించండి.
– షమికా రవి, ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment