1.. Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నిక.. సీఎం కేసీఆర్ మద్దతు ఆయనకే!
దేశంలో రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. విపక్షాల తరపున పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ముందునుంచీ మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుండగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వెంకయ్యనాయుడును కలిశారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3.. వాటిని పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం జగన్
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ మేరకు పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4.. Minister KTR: 'దమ్ముంటే నా మీద కేసులు పెట‍్టండి.. చిన్నా చితక అధికారులను బెదిరించొద్దు'
దేశంలో అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకొచ్చి యువత కడుపు కొడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆవేదనతో వారు ఆందోళన చేస్తుంటే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5.. Eknath Shinde: శివసేనకు మంత్రి గుడ్ బై?.. స్పందించిన ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మంత్రి ఏక్‌నాథ్ షిండే తొలిసారి స్పందించారు. తాను బాల్‌థాక్రే ప్రియ శిష్యుడిని అని, అధికారం కోసం పార్టీకి ద్రోహం చేయబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6.. ODI WC 1975: మొట్టమొదటి విజేత విండీస్.. సరిగ్గా ఇదే రోజు.. జట్టును గెలిపించింది ఎవరో తెలుసా? ఇతర విశేషాలు!
ICC ODI World Cup 1975 AUS Vs WI- Winner West Indies: క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అయినా.. మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్ సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకున్న ఘనత మాత్రం వెస్టిండీస్‌కే దక్కింది. జగజ్జేత... ఈ మాట వింటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా!
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7.. Tollywood: టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె సైరన్, షూటింగ్స్ బంద్!
టాలీవుడ్‌లో సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రేపటినుంచి సినిమా షూటింగ్‌లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8.. గ్లోబల్ డ్రీమ్ క్రూయిజ్ షిప్.. టైటానిక్ కంటే దారుణంగా..
వందేళ్ల కిందట టైటానిక్ షిప్ ప్రపంచంలోనే అతి పెద్ద పడవగా రికార్డు సృష్టించింది. కానీ తొలి ప్రయాణం మధ్యలోనే సముద్రంలో ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి మునిగిపోయింది. తాజాగా వరల్డ్ రికార్డు సాధించే దిశగా మరో భారీ షిప్‌ను నిర్మించడం మొదలెట్టారు. అయితే తొలి ప్రయాణం చేయడానికి ముందే ఈ భారీ నౌక కూడా అప్పుల భారంలో మునిగి నామ రూపల్లేకుండా కనుమరుగు కానుంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9.. రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వద్దని హెచ్చరించిన యూఎన్
మయన్మార్ జుంటా ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు, ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరితీస్తామని ప్రకటించింది. ఇద్దరూ తీవ్రవాదానికి పాల్పడ్డారని, అందువలన మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అదీగాక 1991 తర్వాత దేశంలో తొలిసారిగా న్యాయపరమైన ఉరిశిక్ష విధించిబడుతుందని పేర్కొంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10.. మహబూబాబాద్: మైక్ సెట్ రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురి మృతి
జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment