RBI Tweaks Norms For Interest On Unclaimed Amount After Deposit Matures - Sakshi
Sakshi News home page

Deposit interest Rate: ఆర్‌బీఐ కొత్త షాక్‌!

Published Sat, Jul 3 2021 9:10 AM | Last Updated on Sat, Jul 3 2021 11:52 AM

tweaks norms for interest on unclaimed amount after deposit matures - Sakshi

సాక్షి,ముంబై: బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉన్న డిపాజిట్లకు వర్తించే వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలను సవరించింది.  డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకులకు ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం టర్మ్‌ డిపాజిట్లను కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్‌ వెనక్కి తీసుకోకపోతే.. ఆ తర్వాత నుంచి ఆ మొత్తంపై సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటు అమలవుతోంది. ఇక మీదట అలా కాదు. ‘‘టర్మ్‌ డిపాజిట్‌ గడువు తీరినా, క్లెయిమ్‌ చేసుకోకుండా బ్యాంకు వద్దే ఉండిపోతే ఆ మొత్తంపై సేవింగ్స్‌ ఖాతా రేటు లేదా టర్మ్‌ డిపాజిట్‌ ఒప్పంద రేటు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమలవుతుంది’’ అంటూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, కోఆపరేటివ్‌ బ్యాంకులకు నూతన ఆదేశాలు వర్తిస్తాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement