
ముంబై: ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ పోర్టులో 21 మంది భారత నావికులు చిక్కుకుపోయారు. ఓ వాణిజ్య నౌకలో పనిచేస్తున్న వీరంతా కొన్నిరోజులుగా ఓడరేవులోనే ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు.
ప్రస్తుతం నావికులంతా క్షేమంగానే ఉన్నారని, తరచుగా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని షిప్ మ్యానింగ్ ఏజెన్సీ సీఈఓ సంజయ్ చెప్పారు. మరికొన్ని భారత నౌకలు కూడా మైకోలైవ్ పోర్టులో ఉన్నాయని తెలిపారు. ఈ ఓడరేవు నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ 500 కిలోమీటర్లు, పోలండ్ సరిహద్దు 900 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment