
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణ, కొత్తగా భయాందోళనలకు కారణమైన బ్లాక్ ఫంగస్ తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం మంత్రుల బృందం (జీఓఎం) 27వ సమావేశం నిర్వహించారు. దేశంలో బ్లాక్ల్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్) వ్యాప్తిపై ఈ భేటీలో చర్చ జరిగింది. దేశంలో ఇప్పటివరకు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 5,424 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంత్రుల బృందానికి నివేదించారు.
మొత్తం 5,424 కేసులలో 4,556 మంది రోగులకు కోవిడ్–19 ఉందని ఆయన పేర్కొన్నారు. వీరిలో గుజరాత్‌లో 2,165, మహారాష్ట్రలో 1,188, ఉత్తరప్రదేశ్‌లో 663, మధ్యప్రదేశ్‌లో 519, హరియాణాలో 339, ఆంధ్రప్రదేశ్‌లో 248 కేసులు నమోదయ్యాయి. ఈ రోగులలో మొత్తం 55% మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామన్నారు. గత వారం బ్లాక్ ఫంగస్‌ను ఎపిడమిక్ యాక్ట్ కింద నోటిఫై చేసి నమోదైన కేసుల వివరాలు తెలియచేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. దీంతో బ్లాక్ ఫంగస్‌ను అనేక రాష్ట్రాల్లో అంటువ్యాధిగా ప్రకటించారు.
(చదవండి: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు)
Comments
Please login to add a commentAdd a comment