న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటన రద్దు అయ్యింది. జనవరిలో ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బైడెన్ రావడం లేదు. ఈ విషయాన్ని అమెరికా తెలియజేసిందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
అయితే, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి తొలి వారంలో అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి బైడెన్ వార్షిక ప్రసంగం చేయాల్సి ఉంది. దీంతో, ఆయన భారత్ పర్యటన రద్దు అయ్యింది. కాగా, రెండోదఫా మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపైనా బైడెన్ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. గణతంత్ర వేడుకలకు బెడెన్‌ను భారత ప్రధాని మోదీ ఆహ్వానించారంటూ గత సెప్టెంబరులో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఇక, గణతంత్ర వేడుకలప్పుడే క్వాడ్ సమిట్ కూడా జరపాలని భారత్ భావించినా, దాన్ని తర్వాత నిర్వహించాలని తాజాగా నిర్ణయానికొచ్చింది. ఇదే పర్యటన వాయిదాకు మరో కారణమని సమాచారం. దీంతో, క్వాడ్ సదస్సును 2024 చివరిలో నిర్వహించాలని యోచిస్తున్నారు.
Joe Biden confirmed tht he will not coming to India for the Republic Day ... QUAD meeting postponed.
— Atul Chhabra (@AttiAtul) December 12, 2023
This is 2nd time when Biden will not attending #QUAD meet.
This is sad. Don't knw where Biden is taking this grp. His act will degrading the value & seriousness of the QUAD. pic.twitter.com/zuKEBebSJJ
Comments
Please login to add a commentAdd a comment