
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ అగ్నిప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి నిధులను విడుదలు చేసింది. ఇక ఇప్పటికే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.50లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, విజయవాడలోని ఏలూరు రోడ్డు చల్లపల్లి బంగ్లా సమీపంలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 30 మంది చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు.
(విజయవాడ అగ్ని ప్రమాదం: 10 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment