మరో మహిళతో ఉండగా భార్యకు రెండ్‌ హ్యండెడ్‌గా దొరికిన కాంగ్రెస్‌ నేత | Wife of Congress Man Caught RED Handed When he was With Young Woman | Sakshi
Sakshi News home page

మరో మహిళతో ఉండగా భార్యకు రెండ్‌ హ్యండెడ్‌గా దొరికిన కాంగ్రెస్‌ నేత.. యువతి జుట్టు పట్టుకొని

Jun 2 2022 9:13 PM | Updated on Jun 2 2022 9:30 PM

Wife of Congress Man Caught RED Handed When he was With Young Woman - Sakshi

గది లోపలికి వెళ్లిన సోలంకి భార్య రేష్మా పటేల్‌ ఆగ్రహంతో ఊగిపోయింది. యువతి జుట్టు పట్టుకొని దాడి చేసింది. రూమ్‌ అంతా పరిగెత్తిస్తూ తీవ్రంగా కొట్టింది. హోటల్‌ గదిలోకి  భార్య సడెన్‌ ఎంట్రీ ఇవ్వడంతో సోలంకి షాకయ్యాడు. భార్యను

గాంధీనగర్‌: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. గౌరవప్రదమైన వివాహ బంధానికి మచ్చ తీసుకువస్తున్నాయి. జీవితాంతం తోడుగా జీవించాల్సిన భార్యభర్తల జీవితాలను బజారుకీడుస్తున్నాయి. కుటుంబాలను సైతం నడి వీధికి లాగుతున్నారు. దీంట్లో వీఐపీలు సైతం ఉంటున్నారు. తాజాగా ఈ వివాదంలో మాజీ కేంద్ర మంత్రి చిక్కుకున్నారు. మరో మహిళతో ఉండగా గుజరాత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తన భార్యకు రెడ్‌హ్యండెడ్‌గా దొరికిపోయాడు. రెండుసార్లు గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన భరత్‌సింగ్‌ సోలంకీ.. ఆనంద్‌లోని హోటల్‌ గదిలో మరో మహిళతో సన్నిహితంగా ఉండగా భార్యకు అడ్డంగా బుక్కయ్యాడు.

గది లోపలికి వెళ్లిన సోలంకి భార్య రేష్మా పటేల్‌ ఆగ్రహంతో ఊగిపోయింది. యువతి జుట్టు పట్టుకొని దాడి చేసింది. రూమ్‌ అంతా పరిగెత్తిస్తూ తీవ్రంగా కొట్టింది. హోటల్‌ గదిలోకి  భార్య సడెన్‌ ఎంట్రీ ఇవ్వడంతో సోలంకి షాకయ్యాడు. భార్యను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమెకు ఎంతకు వినిపించుకోలేదు.  దీనికితోడు ‘నువ్వు నా భర్తతో కలిసి కూర్చున్నావు... నిన్ను వదిలిపెట్టను’ అంటూ ఆ తతంగాన్నంతా వీడియో తీసింది. అయితే సదరు యువతి ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది.
చదవండి: బ్యాంక్ మేనేజ‌ర్‌ను కాల్చి చంపిన ఉగ్ర‌వాది.. వీడియో ఇదే

ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భరత్ సింగ్ సోలంకీకి ఆ యువతికి వివాహేతర సంబంధం ఉందని ఆయన భార్య ఆరోపిస్తోంది. ఆమె వల్ల తన జీవితం నాశనం అయ్యిందని వాపోతోంది. అంతేగాక సోలంకీ, అతని భార్య రేష్మా పటేల్‌ల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తనను చిత్రహింసలు పెట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టారని రేష్మా పటేల్ ఆరోపించింది. తనతో దురుసుగా ప్రవర్తించాడని, తన రాజకీయ పదవిని అడ్డుపెట్టుకొని విడాకులు తీసుకునేలా బలవంతం చేశారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement