లక్నో: తనకు ఏమైనా ఫర్వాలేదు.. బిడ్డలకు ఏమీ కాకూడదనే తాపత్రాయం కన్న తల్లిలోనే కనిపిస్తుంది. మరి బిడ్డకు ఆపదొస్తే తల్లి అమాంత ఉరుకుతుంది. కన్న బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే తల్లి ఎంతవరకూ అయినా తెగిస్తుంది. కొండంత బలాన్ని తెచ్చుకుని పోరాటం చేస్తుంది.
ఇందుకు నిదర్శనంగా నిలిచిందో ఓ సంఘటన. యూపీలోని బాహ్రయిచ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన బిడ్డలపై తల్లికుండే ప్రేమకు నిలువటద్దంలా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఖరిఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్డా గ్రామంలో ఒక ఇంటి పరిసర ప్రాంతంలోకి చిరుత ప్రవేశించింది. ఆ ఇళ్లు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఆడుకున్న చిన్నారిపై చిరుత దాడి చేసింది.
అంతే వేగంగా ఆరేళ్ల పాపను పట్టుకుని ఎత్తుకుపోయే ప్రయత్నం చేసింది. దాన్ని చూసిన ఆ పాప తల్లి.. చిరుతపులి ఎత్తుకపోతుంటే చూస్తూ కూర్చోలేదు. ఒక్క ఉదుటన చిరుతపైకి ఉరికింది. తన ప్రాణం గురించి పట్టించుకోలేదు. అది చిరుత అనే సంగతే మరిచిపోయింది. తల్లి మరో చిరుతపులి అయిపోయింది. బిడ్డను రక్షించుకోవడానికి ఒక బలమైన కర్ర తీసుకుని ఆ బిడ్డను వదిలేదాక కొట్టింది. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆ పాపకు చికిత్స అందిస్తున్నారు. అటవీ అధికారులు దీన్ని మీడియాకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆరేళ్ల పాప పేరు కాజల్ కాగా, తల్లి పేరు రీనా దేవి.
Comments
Please login to add a commentAdd a comment