Bahraich District
-
బహ్రెయిచ్ నిందితుల అరెస్టు
బహ్రెయిచ్: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన కాల్పులు, అల్లర్ల ఘటనలో నిందితులైన ఐదుగురిని యూపీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచగా కాళ్లపై షూట్‌చేసి వారిని నిలువరించారు. తొలుత పోలీసులపైకి నిందితులు కాల్పులు జరపడంతో కొద్దిసేపు పరస్పర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బహ్రెయిచ్– నేపాల్ సరిహద్దులోఈ ఘటన జరిగిందని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ అమితాబ్ యష్ చెప్పారు. మొహమ్మద్ ఫహీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మొహమ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ, మొహమ్మద్ అఫ్జల్‌లను అరెస్ట్చేశామని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. తొలుత ఫహీన్, తలీమ్‌లను అరెస్ట్‌చేసి కాల్పులకు వాడిన ఆయుధాన్ని స్వా«దీనం చేసుకునేందుకు పోలీసులు గురువారం మధ్యాహ్నం నేపాల్ సరిహద్దు సమీపంలోని హడా బసేహరీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే హమీద్, సర్ఫరాజ్, అఫ్జల్ పోలీసులపైకి కాల్పులు మొదలెట్టారు. ఈ క్రమంలో సర్ఫరాజ్, తలీమ్ పోలీసుల నుంచి తప్పించుకుని నేపాల్‌కి పారిపోబోయారు. ఈ క్రమంలో పోలీసులు జరిపి ఎదురుకాల్పుల్లో సర్ఫరాజ్, తలీమ్ గాయపడ్డారు. ఒకరి కుడి కాలికి, ఇంకొకరి ఎడమ కాలికి బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మహ్సీ తాహసిల్ పరిధిలోని మన్సూర్ గ్రామంలో అక్టోబర్ 13న దుర్గామాత విగ్రహం ఊరేగింపులో మరో మతానికి చెందిన ప్రార్థనాస్థలం ఎదురుగా భారీ శబ్ధంతో ‘మళ్లీ యోగీజీ వస్తారు’ అంటూ పాటలు, డీజే మోగించడంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా ఒక ఇంటి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఊరేగింపుపై కాల్పులు జరిపాడు. దీంతో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రా చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. వ్యక్తి మృతికి నిరసనగా 14వ తేదీన అల్లరి మూకలు ఇళ్లు, దుకాణాలు, షోరూమ్‌లు, ఆస్పత్రులు, వాహనాలను దగ్ధంచేయడం తెల్సిందే. పరిస్థితి గురువారినికి అదుపులోకి రావడంతో ప్రభుత్వం 4 రోజుల తర్వాత బహ్రెయిచ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. పరిపాలనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర యంత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ దుయ్యబట్టారు. -
UP: తోడేళ్ల దాడుల వెనక ప్రతీకార కోణం!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా తోడేళ్ల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టారు.అయినా ఇవి కొన్ని గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ తోడేళ్ల దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా.. అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో చిన్నారులనే టార్గెట్ చేస్తున్నాయి ఈ తోడేళ్ల గుంపు.అయితే తాజాగా ఈ తోడేళ్లు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల సైతం ప్రతికారం తీర్చుకోవటం కోసం దాడులు చేస్తాయని అన్నారు. ‘‘తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉంది. వాటి నివాసాలు, పల్లలకు హాని తలపెడితే.. మనుషులపై ప్రతీకారంతో దాడులు చేస్తాయి. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చనే అనుమానం ఉంది’’ అని ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు.బహ్రైచ్‌లోని రాముపూర్ సమీపంలోని ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయని, ఆ వరదల్లో తోడేలు పిల్లలు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే.. వాటి తల్లి తోడేలు తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. -
బిడ్డ మీదకు దూకిన చిరుత.. మరి ఆ తల్లి ఊరుకుంటుందా?
లక్నో: తనకు ఏమైనా ఫర్వాలేదు.. బిడ్డలకు ఏమీ కాకూడదనే తాపత్రాయం కన్న తల్లిలోనే కనిపిస్తుంది. మరి బిడ్డకు ఆపదొస్తే తల్లి అమాంత ఉరుకుతుంది. కన్న బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే తల్లి ఎంతవరకూ అయినా తెగిస్తుంది. కొండంత బలాన్ని తెచ్చుకుని పోరాటం చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచిందో ఓ సంఘటన. యూపీలోని బాహ్రయిచ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన బిడ్డలపై తల్లికుండే ప్రేమకు నిలువటద్దంలా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఖరిఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్డా గ్రామంలో ఒక ఇంటి పరిసర ప్రాంతంలోకి చిరుత ప్రవేశించింది. ఆ ఇళ్లు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఆడుకున్న చిన్నారిపై చిరుత దాడి చేసింది. అంతే వేగంగా ఆరేళ్ల పాపను పట్టుకుని ఎత్తుకుపోయే ప్రయత్నం చేసింది. దాన్ని చూసిన ఆ పాప తల్లి.. చిరుతపులి ఎత్తుకపోతుంటే చూస్తూ కూర్చోలేదు. ఒక్క ఉదుటన చిరుతపైకి ఉరికింది. తన ప్రాణం గురించి పట్టించుకోలేదు. అది చిరుత అనే సంగతే మరిచిపోయింది. తల్లి మరో చిరుతపులి అయిపోయింది. బిడ్డను రక్షించుకోవడానికి ఒక బలమైన కర్ర తీసుకుని ఆ బిడ్డను వదిలేదాక కొట్టింది. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆ పాపకు చికిత్స అందిస్తున్నారు. అటవీ అధికారులు దీన్ని మీడియాకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆరేళ్ల పాప పేరు కాజల్ కాగా, తల్లి పేరు రీనా దేవి. -
కోతుల గుంపులో బాలిక
బహ్రయిచ్(యూపీ): కోతుల గుంపుతో కలిసి జీవిస్తున్న ఓ 8 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లా కటార్నియా ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో గుర్తించారు. స్థానికుల ద్వారా బాలిక విషయం తెలుసుకున్న పోలీసులు కష్టపడి ఆమెను మర్కటాల మంద నుంచి గత జనవరిలో వేరు చేశారు. ఆమెకు ప్రస్తుతం బహ్రయిచ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలిక తన భావాలను వ్యక్తపరచలేకపోతోంది. ఎవరైనా ఆమె దగ్గరకు వెళితే గట్టిగా కేకలు వేస్తోంది. ఈ కారణాలతో ఆమెకు సరైన చికిత్స అందించలేకపోతున్నామని వైద్యులు అంటున్నారు. ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ, బాలిక గురించి తమ దగ్గర ఏ సమాచారం లేదనీ, ఆమె ప్రవర్తనను బట్టి చూస్తే చాలా కాలంపాటు అడవిలో కోతులతో జీవిస్తోందని అర్థమవుతోందని చెప్పారు. బాలికను తాము రక్షించినప్పుడు జుట్లు, గోళ్లు బాగా పెరిగి, ఆమె ఒంటినిండా గాయాలు ఉన్నాయని అధికారి పేర్కొన్నారు. -
యూపీలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రుచ్ జిల్లాలో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన పాఠశాల వ్యాన్ డ్రైవర్ అనిల్ కుమార్ బెరియను శుక్రవారం అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. స్కూల్ వ్యాన్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. శుక్రవారం ఆ చిన్నారితోపాటు పలువురు విద్యార్థులను డ్రైవర్ వ్యాన్‌లో స్కూల్‌కు తీసుకువెళ్లాడు. అయితే విద్యార్థులందరిని స్కూల్ వద్ద దింపాడు. కానీ మూడేళ్ల చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆ చిన్నారిని ఇంటి వద్ద దింపాడు. ఆ చిన్నారి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో ఆ కుటుంబ సభ్యులకు ఆగ్రహాంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గత అర్థరాత్రి నిందితుడిని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితునిపై దాడికి ఆ చిన్నారి కుటుంబసభ్యులతోపాటు ఇరుగుపోరుగు వారి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగిందని వైద్యులు దృవీకరించారు.