ఆయన యంగ్‌ ఎమ్మెల్యే.. ఆమె యువ మేయర్‌.. వీరిద్దరూ.. | Youngest Mayor Arya Rajendran To Marry MLA Sachin Dev | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఎమ్మెల్యేతో యువ మహిళా మేయర్ పెళ్లి‌.. ఎక్కడంటే..?

Published Wed, Feb 16 2022 4:17 PM | Last Updated on Wed, Feb 16 2022 5:04 PM

Youngest Mayor Arya Rajendran To Marry MLA Sachin Dev - Sakshi

తిరువనంతపురం : ఆమె దేశ ప్రజలను తన వైపు ఆకర్షించి చిన్న వయసులోనే మేయర్‌ పీఠాన్ని అధిరోహించారు.. ఆయన రాష్ట్ర అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యేందకు సిద్దమయ్యారు. ఈ విషయం కేరళలో ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ ఎవరంటే.. తిరువనంతపురం మేయర్ ఆర్యా రాజేంద్రన్‌, బలుస్సెరీ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌. 

అక్కడే వారిద్దరికీ పరిచయం.. 

విద్యాభ్యాసం తర్వాత బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం వీరు మంచి స్నేహితులయ్యారు. కాగా, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న సమయంలో సచిన్ దేవ్‌కు 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార సీపీఎం పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో, ఎన్నికల్లో బలుస్సెరీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కేరళలో అతిచిన్న వయస్సుల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 

మరోవైపు.. తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్ సీపీఎం పార్టీ తరఫున పోటీ చేశారు. సీనియర్‌ అభ్యుర్థులకు షాకిస్తూ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే 21 ఏళ్ల వయసులో ఈ పదవికి ఎన్నికై దేశం దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. వీరిద్దరి మధ్య స్నేహ బంధం కాస్తా.. త‍్వరలో వివాహం బంధం కానుంది. వీరికి పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు అంగీకరించినట్టు సచిన్ దేవ్ ధ్రువీకరించారు. ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదని.. త్వరలోనే వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement