సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రళయం కొనసాగుతున్న వేళ.. కొవిడ్ కోరలను విరిచి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరో వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన 'జైకోవ్-డి' టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం సంస్థ దరఖాస్తు చేసుకుంది. జైకోవ్-డికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే.. దేశంలో అందుబాటులోకి రానున్న నాలుగో టీకా ఇదే కానుంది.
అయితే కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి మాదిరిగా కాకుండా.. ఇది మూడు డోసుల టీకా. మొదటి డోసు వేసుకున్న నెల రోజులకు రెండో డోసు.. ఆ తర్వాత మరో నెలకు మూడో డోసు వేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా 12 ఏళ్లు దాటిన వారిపైనా జైకోవ్-డి వ్యాక్సిన్ ట్రయల్స్ సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. జైకోవ్-డికి అనుమతి వస్తే దేశంలో చిన్నారులకు ఇదే తొలి వ్యాక్సిన్ కానుంది.
చదవండి: ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
అనుమతి వస్తే.. దేశంలో చిన్నారులకు తొలి కరోనా టీకా ఇదే!
Published Mon, Jun 14 2021 2:12 PM | Last Updated on Mon, Jun 14 2021 3:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment